మిర్చి మిర్చి మిర్చి మిర్చి... మిర మిర మిసైలల్లే వచ్చాడే .. అంటూ మిర్చి సినిమాలో తెగ సందడి చేసింది హంసా నందిని. ఐటెమ్ భామగా లక్కీ హ్యాండ్ అన్న పేరు తెచ్చుకుంది. హంస ఐటెమ్ లో నర్తిస్తే చాలు ఆ సినిమా హిట్టే అన్న టాకొచ్చింది. మిర్చి ఘనవిజయం సాధించిన తర్వాత వరుసగా అరడజను పైగానే సినిమాల్లో నర్తించింది. అవన్నీ హిట్టయ్యాయి. అందుకే హంసను అప్పట్నుంచి పిలిచి మరీ అవకాశాలిస్తున్నారంతా.
సినిమాలో ఎంత గ్లామర్ ఉన్నా, చివరిలో హంస ఓ ఐటెమ్ లో చిందేసి వెళితే అదో సంతృప్తి. దర్శనిర్మాతలు దానిని ఓ సెంటిమెంటుగా భావిస్తున్నారు. మిర్చి తరువాత లెజెండ్, అత్తారింటికి దారేది, భాయ్, రామయ్య వస్తావయ్యా వంటి సినిమాల్లో మెరిసిందీ బంగారం. త్వరలో రుద్రమదేవి, సోగ్గాడే చిన్నినాయనా సినిమాల్లో కూడా తళుక్కుమంటుంది. లేటెస్టుగా రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న బెంగాళ్ టైగర్ చిత్రంలోనూ హంస ఐటెమ్ నంబర్ లో నర్తించింది. రామోజీ ఫిలింసిటీ లో ఈ ఐటెమ్ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు.
హంస-రవితేజ కాంబినేషన్ లోని హాట్ సాంగ్ ఇది. ఇప్పటికే తమన్నా, రాశిఖన్నా లాంటి హాట్ గాళ్స్ ఉన్నా హంస చేరికతో హీట్ మరింత పెరిగింది. మరింత మసాలా దట్టించినట్టయ్యింది. సంపత్ నంది మాస్ డైరెక్టర్ గా పాపులర్ అయ్యాడు కాబట్టి, అందుకు తగ్గట్టే కంటెంట్ లోనూ గరమ గరమ అప్పియరెన్స్ పెరిగిందనే అనుకోవాలి.