మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `రామారావు ఆన్ డ్యూటీ`. శరత్ మండవ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీలో హీరోయిన్ లుగా `జై భీమ్` ఫేమ్ రజీషా విజయన్, దివ్యాన్షకౌశిక్ నటించారు. రవితేజకు సంబంధించిన ఆర్.టి టీమ్ వర్క్ తో కలిసి ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 29న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
మాస్ రాజా రవితేజ డిప్యూటి కలెక్టర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటించిన చిత్రమిది. హీరో వేణు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రవితేజకు సపోర్ట్ గా నిలబడే సీఐ జమ్ము మురళి పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత మళ్లీ అ మూవీతో హీరో వేణు రీఎంట్రీ ఇస్తున్నారు. తన క్యారెక్టర్ కున్న ప్రధాన్యత నచ్చి ఈ మూవీలో నటించానని వేణు ఇటీవలే వెల్లడించారు. దీంతో ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది. ఇందులో భాగంగా లిరికల్ వీడియోలని రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. తాజాగా హాట్ లేడీ అన్వేషీ జైన్ పై చిత్రీకరించిన `నా పేరు సీసా` అంటూ సాగే హాట్ ఐటమ్ నంబర్ ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట సందడి చేస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చింది.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లిరికల్ వీడియోలు రిలీజ్ చేస్తున్న చిత్ర బృందం తాజాగా ఈ మూవీ టైటిల్ వెనకున్న సీక్రెట్ ని బయటపెట్టింది. ముందు ఈ మూవీకి `రామారావు ఆన్ డ్యూటి` టైటిల్ ని అనుకోలేదట. `గవర్నమెంట్ ఆన్ డ్యూటీ` అనుకున్నారట. అయితే ఈ టైటిల్ కెమెరా మెన్ సత్యన్ సూర్యన్ కు పెద్దగా నచ్చలేదట. దాంతో వారు మరో టైటిల్ ని సూచించారట. అదే `రామారావు ఆన్ డ్యూటి`.
ఈ విషయం హీరో రవితేజకు చెప్పడం.. టైటిల్ ఇదే బాగుందని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దర్శకుడు శరత్ మండవ కూడా `రామారావు ఆన్ డ్యూటి`కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. దీంతో ఇదే టైటిల్ ఫైనల్ పోస్టర్ మీదకి వచ్చేసింది. కథకు తగ్గట్టే టైటిల్ కూడా పవర్ ఫుల్ గా వుండటంతో ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారిందని చెబుతున్నారు.