దేశం మెచ్చిన దర్శకుడు శంకర్ ఈసారి ఎలాగైనా రాంచరణ్ తో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్ 15 సినిమాను దిల్ రాజు లెక్కకు మించి బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది అని దిల్ రాజు కంగారుపడుతున్నప్పటికీ కూడా శంకర్ మాత్రం అస్సలు తగ్గకుండానే సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమా ఎంతవరకు వచ్చింది అనే వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్ కీయరా అద్వానీ ప్రస్తుతం ఒక సాంగ్ షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ఆచార్య గణేష్ నేతృత్వంలో 1000 మంది డాన్సర్లతో ఒక ప్రత్యేకమైన సాంగ్ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక నెక్స్ట్ షెడ్యూల్లో పూర్తిగా యాక్షన్స్ సీన్స్ షూట్ చేయబోతున్నారట. దాదాపు 1200 మంది ఫైటర్స్ తో ఆ యాక్షన్ ఎపిసోడ్ ను శంకర్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
పూర్తిగా హైదరాబాదులోనే ఆ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారట. ఇక ఆగస్టు లో 70% షూటింగ్ పూర్తి చేయనున్న చిత్ర యూనిట్ డిసెంబర్ లోపు పూర్తిస్థాయిలో మొత్తం షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సెప్టెంబర్ వరకు ఇండియాలోనే షూటింగ్ చేసి ఆ తర్వాత మరొక కీలకమైన షెడ్యూల్ కోసం హీరో హీరోయిన్ ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళనున్నారు.
ఒక ప్రత్యేకమైన వాతావరణంలో వింటర్ సీజన్లో శంకర్ లాస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేయనున్నాడట. ఏదేమైనా కూడా ఈ సినిమా కోసం దిల్ రాజు శంకర్ విజన్ కు తగ్గట్టుగానే భారీగానే ఖర్చు పెడుతున్నాడు.
మరి సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఇక సినిమాను మొదట సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా సమ్మర్ లోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.