బ్రూస్‌ లీ.. పవన్‌ ఫ్యాన్స్‌ దెబ్బేశారా??

Update: 2015-10-18 09:30 GMT
రామ్‌ చ‌ర‌ణ్ హీరోగా శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ్రూస్‌ లీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డానికి ర‌క‌ర‌కాల కార‌ణాల్ని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్‌ - చెర్రీ న‌ట‌న‌ - యాక్ష‌న్ అద్భుతంగా ఉన్నా ఈ సినిమాలో క‌థ‌ - కంటెంట్ లేక‌పోవ‌డం ఒక పెద్ద మైన‌స్ అని చెబుతున్నారు. అలాగే టైటిల్‌ కి - సినిమాకి ఏమాత్రం సంబంధం లేక‌పోవడం అతి పెద్ద ఫెయిల్యూర్ అని చెబుతున్నారు. శ్రీ‌నువైట్ల ప‌ర‌మ రొటీన్ లైన్‌ తో అంతే రొటీన్‌ గా ఈ సినిమాని తెర‌కెక్కించ‌డం పెద్ద మైన‌స్ అయ్యింద‌ని విశ్లేషిస్తున్నారు.

ఓ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక విశ్లేష‌ణ ప్ర‌కారం... అస‌లు బ్రూస్‌ లీకి మెగాభిమానుల స‌పోర్ట్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింద‌ని రాసుకొచ్చారు. దీనికి నాగ‌బాబు - చిరంజీవి - శ్రీ‌నువైట్ల ముగ్గురూ బాధ్యుల‌ని చెప్పుకొచ్చింది స‌ద‌రు ప‌త్రిక‌. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టిన‌రోజు వేడుక‌ల వేళ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ ని నాగ‌బాబు హ‌ర్ట్ చేయ‌డంతో వారంతా బ్రూస్‌ లీ చిత్రాన్ని బోయ్‌ కాట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని వార్త‌లొచ్చాయి. అలాగే చిరంజీవి ఓ సంద‌ర్భంలో స్టుపిడ్ అని అభిమానుల్ని ఉద్ధేశించి తిట్ట‌డం కూడా ఇప్పుడు బ్రూస్‌ లీపై ప్ర‌భావం చూపించింద‌ని చెప్పుకుంటున్నారు.

అస‌లు బ్రూస్‌ లీ పేరుకి ఈ సినిమాకి క‌నెక్ష‌న్ ఎక్క‌డుంది? ఈ సినిమా చూసొచ్చాక.. హ్యాంగోవ‌ర్ దిగ‌డానికి ఎంట‌ర్ ది డ్రాగ‌న్ చూడాల్సొచ్చింద‌ని రామ్‌ గోపాల్ వ‌ర్మ అభిప్రాయ‌ప‌డ్డారు. దీన్నిబ‌ట్టి బ్రూస్‌ లీ పూర్ క‌లెక్ష‌న్స్ వెన‌క ఇంత క‌థ ఉందా? ఇన్ని న‌గ్న స‌త్యాలున్నాయా? అన్న సందేహాలూ వ‌స్తున్నాయి.  అదీ మ్యాట‌రు.
Tags:    

Similar News