అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ 'పుష్ప'. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్ లో బన్నీ మొరటు కుర్రాడిగా కనిపించాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. దీని కోసం కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. దీంతో గత ఆరు నెలల నుండి షూటింగ్ చేయడం సాధ్యపడలేదు. అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో 'పుష్ప' కూడా త్వరలోనే సెట్స్ లో అడుగుపెడతాడని వార్తలు వస్తున్నాయి.
కాగా నేడు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ ప్రాంతంలోని కుంటాల జలపాతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి బన్నీ తన కుటుంబ సభ్యులతో పాటు మహారాష్ట్రకు చేరుకున్నారని తెలుస్తోంది. బన్నీ మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో పర్యటిస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పర్యటనలో బన్నీ ఫ్యామిలీతో పాటు 'పుష్ప' టీమ్ కూడా ట్రావెల్ చేస్తున్నారట. పనిలో పనిగా 'పుష్ప' కోసం లొకేషన్స్ వేట సాగిస్తున్నారని తెలుస్తోంది. కుంటాల జలపాతం వద్ద షూటింగ్ చేసుకోవడానికి అనువైన ప్రదేశాలను గుర్తించారట. అలానే తిప్పేశ్వర్ అభయారణ్యంలో కూడా షూటింగ్ కి అనువైన లొకేషన్స్ చూస్తున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే 'పుష్ప' సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.