అల్లు శిరీష్.. మలయాళంలో.. అది కూడా మోహన్ లాల్ కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడనగానే అది అన్నయ్య అల్లు అర్జున్ రెకమండేషన్ తోనే అనుకున్నారంతా. ఐతే ఈ ఛాన్స్ తనకు రావడంలో అన్నయ్య ప్రమేయం ఏదీ లేదని.. అది తన స్వయం ప్రతిభతో దక్కించుకున్న ఛాన్స్ అని అంటున్నాడు శిరీష్. ‘1971-బియాండ్ బోర్డర్స్’ చిత్రంలో వార్ ట్యాంక్ కమాండర్ గా తనకు కీలక పాత్ర ఎలా దక్కిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు శిరీష్. అతనేమంటున్నాడంటే..
‘‘నాకు దేశభక్తి ఎక్కువ. అందుకే నాకీ రోల్ దక్కింది. ఇలాంటి హిస్టారికల్ మూవీలో నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా దర్శకుడు మేజర్ రవి ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అనుకోకుండా కలిశాను. అప్పుడు సినిమాల గురించి మాట్లాడుతూ మన చరిత్రకు సంబందించిన కొన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం. అప్పుడే ఆయన.. నాకు నీలాంటి వ్యక్తే కావాలి. ఈ రోల్ నువ్వే చేయాలి అన్నారు. ఆయనకు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండి.. రిస్క్ తీసుకునే వ్యక్తి కావాలి. అవన్నీ నాలో చూసి ఈ రోల్ ఆఫర్ చేశారు’’ అని శిరీష్ తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. శిరీష్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రాజస్థాన్ లోని అరుణ్ ఘర్ ఆర్మీ బేస్ లో ఈ చిత్ర షెడ్యూల్ జరుగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/