కార్పొరెట్ కంపెనీలు సినిమా ఫీల్డులో ఏం పొడిచేస్తాయి? అన్న విమర్శల్ని తట్టుకుని .. సినిమా అంటేనే కార్పొరెట్ అనే లెవల్ కి తీసుకెళుతున్నాయి బడా కంపెనీలు. అలాంటి వాటిలో పీవీపీ సినిమాస్ ఒకటి. పొట్లూరి వరప్రసాద్ నిర్మాతగా ఈ బ్యానర్ లో ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాలు తెరకెక్కి రిలీజయ్యాయి. అయితే వీటిలో అనుష్క కథానాయికగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన వర్ణ డిజాస్టర్ రిజల్ట్ ని అందుకుంది. దాంతో పీవీపీకి దర్శకుడికి మధ్య బోలెడన్ని మనస్పర్థలు వచ్చాయని ప్రచారమైంది. ఏదేమైనా అది పాస్ట్. అలాగని గతాన్ని మర్చిపోలేని పరిస్థితి ఉందని ఫిలింనగర్లో ముచ్చటించుకోవడం విశేషం.
అసలు వర్ణ ఫ్లాపవ్వడం వల్లే సైజ్ జీరో అనే ప్రాజెక్టు ఉంది అన్నది ప్రస్తుతం ఫిలింనగర్ వార్తాహరుల సమాచారం. ఆ సినిమా ప్లాపైంది కాబట్టి అందులో నాయకానాయికలుగా నటించిన అనుష్క - ఆర్య జోడీ పీవీపీ బ్యానర్ లో మరో సినిమాకి సంతకం చేశారు. అది మోరాలిటీ కోసం చేసిన సంతకం. అయితే వాస్తవానికి సైజ్ జీరో చిత్రీకరణ పూర్తయి చాలా కాలంగా రిలీజ్ కి ఎదురు చూస్తోంది. ఈ మూవీని రుద్రమదేవి 3డి కంటే ముందే రిలీజ్ చేయాలని పీవీపీ ప్రయత్నించారు. కానీ స్వీటీ అనుష్క అందుకు ససేమిరా అన్నారని తెలుస్తోంది. రుద్రమదేవి రిలీజ్ తర్వాతే ఈ సినిమాని రిలీజ్ చేయండి. లేదంటే సైజ్ జీరో ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేను అని ఖరాకండిగా చెప్పిందిట. ఇప్పుడర్థమైందా? సైజ్ జీరో వెనుక అసలు మిస్టరీ. ఈనెల 27న సైజ్ జీరో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.