ఎన్టీఆర్ మిగిల్చిన గాయాలు మెల్లగా మర్చిపోతూ నందమూరి బాలకృష్ణ సినిమాలకు రెడీ అవుతున్నాడు. మొన్నటి దాకా బోయపాటి సినిమా చేయబోతున్నాడు అనే అంచనాలకు భిన్నంగా ఉన్నట్టుండి జైసింహా డైరెక్టర్ కెఎస్ రవికుమార్ ని లైన్ లోకి తీసుకురావడం అందరికి షాక్ ఇచ్చింది. ఇది మీడియా సైతం ఊహించనిదే. కారణాలు అర్థం కాక అభిమానులు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఇందులో కొన్ని కారణాలు కనపడుతున్నాయి.
మొదటిది వినయ విదేయ రామ వైఫల్యం. తన క్యాలిబర్ మీదే అనుమానం వచ్చేలా బోయపాటి దాన్ని పేలవంగా తీర్చిదిద్దిన తీరు అతనితో నెక్స్ట్ మూవీ చేయబోయే ఏ హీరోకైనా అనుమానం వచ్చేలా చేస్తుంది. దానికి బాలయ్య మినహాయింపు అని చెప్పలేం. పైగా నలభై కోట్లకు తక్కువ డిమాండ్ చేయని సబ్జెక్టు బోయపాటి అసలు రాసుకోడని టాక్ ఉంది.
ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ ఫలితం బాగా డ్యామేజ్ చేసిన బాలయ్య మార్కెట్ కు అంత మొత్తం అంటే చాలా పెద్ద రిస్కు. అందుకే ముందు అనుకున్న లైన్ కాకుండా వేరేది రెడీ చేయమని దానికి ఎలాగూ టైం పడుతుంది కాబట్టి ఈలోగా నిర్మాత సి కళ్యాణ్ కు ఇచ్చిన మాట మేరకు రవి కుమార్ ని రంగంలోకి దించినట్టు తెలిసింది
కాని ఇక్కడా ఒక ట్విస్ట్ ఉంది. బాలయ్య సి కళ్యాణ్ కు మాట ఇచ్చింది వివి వినాయక్ దర్శకత్వంలో చేసేందుకు. కాని వినాయక్ ఎంతకీ హీరోకు నచ్చే కథను సిద్ధం చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. దీంతో ఇది కాస్త రవికుమార్ చేతుల్లోకి వెళ్ళింది. నిజానికి కెఎస్ రవికుమార్ ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేదు. ఏదో వీక్ అపోజిషన్ పండగ సీజన్ వల్ల అప్పుడు జైసింహ కమర్షియల్ గా పాస్ అయ్యింది కాని అది ఫ్యాన్స్ ని సైతం పూర్తిగా మెప్పించిన సినిమా కాదు. ఈయన గట్టిగ చెప్పుకునే హిట్టు కొట్టి 11 ఏళ్ళు దాటింది. డిజాస్టర్ కు తక్కువ స్థాయిలో ఏదీ ఆడలేదు.
మరి బాలకృష్ణ అంత నమ్మకంతో కేఎస్ రవికుమార్ నే మళ్ళి నమ్మడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక్కడ ఒక్కటి మాత్రం స్పష్టం. బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీగా ముగ్గురు దర్శకులు మాత్రమే ఉన్నారు. బోయపాటి-వినాయక్- రవికుమార్. ఇక పరిశ్రమలో ఉన్న మిగిలిన స్టార్ డైరెక్టర్లందరూ వేరే వేరే స్టార్ల తో కమిట్ అయిపోయారు. సో బాలకృష్ణ ఇందులో బెస్ట్ ఆప్షన్ గా రవికుమార్ ను ఎంచుకున్నాడు తప్ప విడిగా చూసుకుంటే ఇదీ రిస్క్ కిందకే వస్తుంది. ఇది ఏ జానర్ ఇందులో బాలయ్య పాత్ర ఏంటి లాంటి వివరాలు వచ్చే నెల షూటింగ్ మొదలుపెట్టే రోజు తెలుస్తాయి