సౌత్ ఇండియాలో ఉన్న అన్ని భాషల్లోనూ టాప్ హీరోయిన్ గా హవా సాగించింది గౌతమి ఒకప్పుడు. హీరోయిన్ గా మంచి స్థాయిలో ఉండగానే ఆమె తన కెరీర్ ను త్యాగం చేసి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఫెయిలైనా సరే.. మళ్లీ సినిమాల వైపు చూడలేదు. డబ్బు అవసరమున్నా.. ఎన్నో అవకాశాలు వచ్చినా.. ఆమె మాత్రం తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. ఇంత పట్టుదలగా ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నారు అని అడిగితే.. తన కూతురు సుబ్బులక్ష్మి కోసమే అంటోంది గౌతమి. తన కూతురికి పూర్తిగా తన అవసరం ఉందని భావించే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై సినిమాల్లో నటించకూడదన్న నిర్ణయం తీసుకున్నా.. మళ్లీ తన కూతురే స్వయంగా సినిమాల్లో నటించమంటేనే ఇప్పుడు ‘మనమంతా’ కోసం మళ్లీ మేకప్ వేసుకున్నానని గౌతమి చెప్పింది.
‘‘సినిమాలకు దూరంగా ఉండాలన్నది కావాలని తీసుకొన్న నిర్ణయం. అందుకు ప్రధాన కారణం మా పాప సుబ్బులక్ష్మే. తనకి అమ్మగా నా అవసరం ఉందనిపించింది. పైగా మా అమ్మానాన్నలు కూడా చనిపోయారు. దీంతో సుబ్బులక్ష్మికి నేనే అన్నీ అయి పెంచాను. మధ్యలో కొంతమంది నన్ను నటించమని అడిగారు. కానీ నేను కావాలనే నటించడం లేదన్న సంగతి వాళ్లకర్థమైంది. ఈ గ్యాప్ వల్ల నేను కోల్పోయిందేమీ లేదు. మానసికంగా మరింత దృఢంగా మారడానికి ఈ సమయం ఉపయోగపడింది. ఒక స్టార్ హీరోయిన్ గా నా చుట్టూ చాలామంది ఉన్నారు ఒకప్పుడు. ఐతే ఒంటరిగా నా పనులు నేను చేసుకుంటే ఎలా ఉంటుందో అర్థమైంది. ఇంటి భారాన్ని ఒక్కదాన్నే మోయడంలో ఉండే తృప్తి తెలిసింది. పైగా అమ్మతనాన్ని ఆస్వాదించా. నేనో సినీ నటిని అన్న విషయం పదేళ్లు వచ్చే వరకు నా కూతురికి తెలియదు. ఇప్పుడు తనకు పదిహేడేళ్లు. తనే నన్ను మళ్లీ నటించమంటూ ప్రోత్సహించింది. అలాంటి టైంలోనే ‘మనమంతా’ లాంటి మంచి కథ నా దగ్గరకు వచ్చింది. ఇంకేం ఆలోచించకుండా మేకప్ వేసేసుకున్నా’’ అని కొన్నా.