స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఎందరో స్టార్లకు లైఫ్ నిచ్చారు. ఎందరో టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. స్టార్లను సూపర్ స్టార్లను - స్టారాధిస్టార్లను చేశారు. ఇండస్ట్రీలో ఎదురేలేని స్థానాన్ని అందించారు. ఆయన తయారు చేసిన దర్శకరచయితలు పరిశ్రమలో ఉన్నారు. రజనీకాంత్ - మమ్ముట్టి - ప్రకాష్ రాజ్ - మోహన్ లాల్ - నాగార్జున లాంటి ఎందరో గొప్ప స్టార్ల సక్సెస్ లో ఆయన కీలక భాగస్వామి. అరవింద స్వామిని తయారు చేసింది ఆయనే. ఇక నటించను అని వెళ్లిపోయినా కాలర్ పట్టుకుని వెనక్కి లాక్కొచ్చారు అరవింద స్వామిని. ఇండస్ట్రీలో ఎందరో నటవారసుల్ని మణిరత్నం పరిచయం చేశారు. గ్రేట్ స్టార్ అనీల్ కపూర్ - ట్యాలెంటెడ్ ఆర్.మాధవన్(సఖి) - స్నేహ భర్త- నటుడు ప్రసన్న - నిరోష - బేబి షామిలి - కిట్టి ఇందరిని పరిచయం చేశారు. స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ ని ` రోజా ` సినిమాతో పరిచయం చేసింది ఆయనే. అదీ ఆయన స్టామినా.
మమ్ముట్టి కొడుకు దుల్కార్ పేరు సౌత్ అంతటా విస్తరించిందంటే ఆయన చలువే. `ఓకే బంగారం`తో అంతటి స్టార్ డమ్ ని తేగలిగారు. దుల్కార్ ని నేడు తెలుగు ప్రేక్షకులు బంగారం అని ముద్దుగా పిలుచుకుంటున్నారంటే ఎవరు కారణమో చెప్పనక్కర్లేదు. పలువురు నాటి మేటి క్లాసిక్ కథానాయికల కూతుళ్లను ఆయన తెరకు పరిచయం చేశారు. గ్లామర్ క్వీన్ - మెగా నాయిక రాధ రెండో కూతురు తులసిని మణిరత్నం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కార్తీక కెరీర్ కి ఆయన సలహాలిచ్చారని రాధ పలుమార్లు చెప్పారు. అందుకే నిన్నటిరోజున మేటి కథానాయిక జీవిత `నవాబ్` ఈవెంట్ లో మణి సర్ తో కలిసి కనిపించే సరికి అందరిలో బోలెడన్ని సందేహాలు.
ఇంతకీ జీవిత కుమార్తెలు శివానీ - శివాత్మికల కెరీర్ ని తీర్చిదిద్దమని జీవిత మణి సర్ ని అడిగారా? మణి సర్ ఈ స్టార్ కిడ్స్ పై దృష్టి సారిస్తారా? అంటూ వేదిక వద్ద ముచ్చటా సాగింది. ఇద్దరు కుమార్తెల్ని పెద్ద స్టార్లను చేయడమే ధ్యేయంగా పావులు కదుపుతున్న జీవిత-రాజశేఖర్ దంపతులు మణి సర్ సలహాలేవైనా తీసుకుంటున్నారా? అంటూ ముచ్చటించుకున్నారు. సుహాసిని మణిరత్నం స్నేహితురాలు జీవిత.. అందుకే ఈ సందేహాలన్నీ. ప్రయత్నం బావుంది.. శివానీ కెరీర్ కోసం తెలుగు - తమిళ్ లో వేగంగా పావులు కదుపుతున్నారు. అడివి శేష్ తో శివానీ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. తమిళంలోనూ ప్రయత్నాలు జోరుగానే ఉన్నాయి. రెండో తనయ శివాత్మిక ఫోటోషూట్ల హడావుడి తెలిసిందే. తొందర్లోనే శివాత్మిక కథానాయికగా పరిచయం కానున్నారు. ఇక్కడ ఎవరిని ఏ అవకాశం ఎలా వరిస్తుందో ఎవరికీ తెలీదు. అలాంటి ఛాన్స్ ఆ స్టార్ కిడ్స్ కి ఉంటుందేమో చూడాలి.