కాజల్ కిస్సు వెనక టెన్షన్ స్టోరీ

Update: 2016-06-02 17:30 GMT
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఓ ముద్దు సీన్.. ఈ మధ్య హాట్ టాపిక్ గా మారింది. స్క్రిప్ట్ లో లేకపోయినా.. ముందుగా చెప్పకుండానే సీన్ లో బాగా లీనమైపోయిన రణ్ దీప్ హుడా.. హీరోయిన్ కాజల్ కి లిప్ లాక్ వేసేశాడని ఓ సారి హంగామా చేశారు. ఆ తర్వాత అబ్బెబ్బే ఏదో చెబితే ఇంకేదో రాశారు మీడియా జనాలు అన్నారు. చివరకు అసలు స్క్రిప్ట్ లోనే మూతి ముద్దు విషయం ఉందని చెప్పిన కాజల్.. అసలు అవతలి వ్యక్తికి తెలీకుండా ముద్దుపెట్టడం సాధ్యమేనా అని కూడా నిలదీసింది.

ఇదంతా 'దో లఫ్జోం కీ కహానీ' సినిమాకి ఫ్రీ ప్రమోషన్స్ కోసం వేసిన స్కెచ్ అనే సంగతి జనాలకు బాగా అర్ధమయ్యాక.. ఇప్పుడు రియల్ ప్రమోషన్స్ లో దీన్నే కొత్తగా చెప్పేందుకు ట్రై చేస్తోంది కాజల్. ఇప్పుడీ అమ్మడు చెబుతున్న లేటెస్ట్ సంగతి ఏంటంటే.. 'ముద్దు సీన్ కోసం భయపడలేదు కానీ.. రణ్ దీప్ హుడాతో ముద్దు అంటేనే బాగా భయపడ్డా' అంటూ కొత్త పాఠం మొదలుపెట్టింది. ఆన్ స్క్రీన్ పై ముద్దు విషయంలో అబ్జెక్షన్ లేనపుడు.. రణ్ దీప్ ని మాత్రం ఎందుకంత తేడాగా చూస్తున్నావనే క్వశ్చన్ ఆటోమేటిగ్గా రెయిజ్ అవుతుంది కదా!

అందుకు మన చందమామ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా.. 'జిస్మ్2 మూవీలో రణ్ దీప్ పెట్టిన ముద్దులను బాగా అబ్జర్వ్ చేశా. అంత గాఢంగా లిప్ సీన్ అంటే బాగా భయమేసింది. అంత గట్టిగా ముద్దు పెట్టుకుంటాడేమో అన్నదే నా అసలు భయం' అంటూ ఆ లిప్ లాక్ వెనక ఉన్న టెన్షన్ స్టోరీ చెప్పింది కాజల్. ఏమైనా కానీ.. పెట్టింది ఒక ముద్దు.. చేసింది సింగిల్ షాట్.. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఎంతగా ప్రచారం చేస్తున్నారో!!
Tags:    

Similar News