క్రిష్‌ వెనుకే చాలా రికమండేషన్లు

Update: 2017-05-12 05:51 GMT
డైరెక్టర్ కు ఉండవలిసిన ప్లాన్ పద్దతి విజన్ ఈ మూడు ఉన్న తెలుగు డైరెక్టర్ క్రిష్. అతనికున్న ప్లాన్ వలనే అతి తక్కువ టైమ్ పీరియడ్ లో  గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి పీరియాడిక్ డ్రామా సినిమాను తీయగలిగాడు. అంతకు ముందు తీసిన కంచె కూడా ఇంచుమించు అలాంటిదే. రెండిటిలో యుద్దాలు పెద్ద పెద్ద సెట్ వేసి తీయవలిసినివే. చాలా పరిమిత బడ్జెట్ లో చాలా క్వాలిటి సినిమా తీయడం అంటే అది కేవలం క్రిష్‌ వలనే సాధ్యమైంది.

అందుకే ఇప్పుడు హింది తెలుగు తమిళ్ లో రాణి ఝాన్సీ లక్ష్మిభాయ్ తీసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. హింది క్వీన్ కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో మనికర్ణిక అనే ఈ బయోపిక్ క్రిష్ డైరక్షన్ లో కొద్ది రోజులు కిందట వారణాసి లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదట అనుకున్నప్పుడు కేతన్ మెహతా డైరెక్టర్ గా అనుకున్నారు. కాన్ని కొద్ది నెలల చర్చలు తరువాత క్రిష్ పేరు టేబల్ పైన పెట్టారు అక్కడ నిర్మాణ బృంధం. అప్పటికే తక్కువ టైమ్ లో తీసిన గౌతమీపుత్ర శాతకర్ణి సక్సెస్ అయ్యింది. దానితో క్రిష్ పైన అందరికీ తెగ నమ్మకం ఏర్పడింది. ఇంకా కంగనా కూడా క్రిష్ కి ఓటువేసింది. అలాగే తెలుగు రచయత బాహుబలి కథకుడు విజయేంద్ర ప్రసాద్ కూడా రికమెండ్ చేశారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా కోసం క్రిష్‌ ను రికమండ్ చేయడం బాలీవుడ్ లో చాలామందికి మింగుడుపడలేదు. కాని బాహుబలి 2 సక్సెస్ చూశాక.. తెలుగు డైరక్టర్ల రేంజ్ ష్యూర్ గా పెద్ద లెవెల్ కు వెళ్లిపోయింది. అందుకే బాలీవుడ్ మీడియా అంతా.. క్రిష్‌ ను వేరే డైరక్టర్ ఛాన్స్ దొబ్బేశాడంటూ టార్గెట్ చేసింది. కాని మనోడు మాత్రం తన వెనుక ఎంతమంది రికమండేషన్ ఉందీ ఇన్ డైరక్టుగా చెప్పేశాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News