సవ్యసాచి ఎందుకు ఒప్పుకున్నాడంటే..

Update: 2018-01-23 17:30 GMT
అవ్వడానికి తమిళ నటుడే అయినా.. మాధవన్ కు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. తమిళ అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అతను బాగానే పరిచయం. హిందీలో డైరెక్ట్ సినిమాలతో అక్కడా మంచి పేరే సంపాదించాడు. ఐతే హిందీలో నేరుగా సినిమాలు చేసిన వాడు.. తెలుగు వైపు మాత్రం చూడలేదు. గతంలో ఒకసారి తెలుగు సినిమాలో నటిస్తారా అంటే చేయనంటూ ఖరాఖండిగా చెప్పేశాడు మాధవన్. తనకు తెలుగు తెలియదని.. తెలియని భాషలో తాను సినిమా చేయలేనని అన్నాడు. అలాంటి వాడు ఇప్పుడు యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ చేయడానికి అంగీకరించాడు. మరి ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకున్నాడన్న సందేహం కలగడం. ఈ సందేహానికి తాజాగా ప్రముఖ క్రిటిక్ భరద్వాజ్ రంగరాజన్‌ తో ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానం ఇచ్చాడు మాధవన్.

‘‘అవును. నాకు తెలుగు రాదు. అందుకే ఇన్నేళ్లలో ఇక్కడ సినిమాలు చేయలేదు. ఐతే ‘సవ్యసాచి’ స్క్రిప్టు.. అందులో నా పాత్ర నన్ను ఎగ్జైట్ చేశాయి. చందూ మొండేటి లాంటి ఎగ్జైటింగ్ యంగ్ టాలెంట్ తో పని చేయాలనిపించింది. అందుకే భాష విషయం పక్కన పెట్టి ఈ సినిమా చేశాను. నేను ఈ సినిమాకు కేటాయించింది కూడా తక్కువ రోజులు. ఇందులో నేను హీరో కాదు. పెద్ద అతిథి పాత్ర లాంటిది. నెగెటివ్ రోల్. తమిళంలోనో.. హిందీలోనో సినిమా చేస్తున్నపుడు ఉండే అడ్వాంటేజీ నాకు ఇక్కడ లేని మాట వాస్తవం. స్పాంటేనియస్ గా ఒక డైలాగ్ చెప్పడం.. ఏదైనా ఇంప్రొవైజ్ చేయడం కుదరదు. కానీ నా పాత్ర ప్రత్యేకమైంది కావడంతో ఈ సినిమా చేస్తున్నా. చాలా రిచ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు’’ అని మాధవన్ తెలిపాడు.
Tags:    

Similar News