తెలుగు నుంచి హిందీలోకి డబ్ అవుతున్న సినిమాలు యూట్యూబ్ లో వ్యూస్ మోత మోగించేస్తుండటం సంచలనం రేపుతోంది. ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా హిందీలోకి అనువాదమై భారీ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ‘బాహుబలి’తో ప్రభాస్ కు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో అతడి డిజాస్టర్ మూవీ ‘రెబల్’ను డబ్ చేసి యూట్యూబ్ లో పెడితే దానికి కూడా భారీగా వ్యూస్ వచ్చాయి. అల్లు అర్జున్ సినిమాలన్నింటికీ కూడా నార్త్ ఇండియాలో చక్కటి ఆదరణ లభిస్తోంది. ఈ కోవలోనే రాజమౌళి విజువల్ వండర్ ‘మగధీర’ సంచలన రికార్డును సొంతం చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. హిందీ సినిమాలకు కూడా సాధ్యం కాని రీతిలో ఈ చిత్ర డబ్బింగ్ వెర్షన్ కు యూట్యూబ్ లో ఏకంగా 10 కోట్ల వ్యూస్ రావడం హాట్ టాపిక్ గా మారింది.
మరి ‘మగధీర’కు మరీ ఆ స్థాయిలో వ్యూస్ ఎలా వచ్చాయంటే.. దానికి కారణాలు బోలెడున్నాయి. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళికి నార్త్ ఇండియాలో తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది. దీంతో అతడి చరిత్రను తవ్వడం మొదలుపెట్టారు అక్కడి జనాలు. ఆ క్రమంలోనే ‘మగధీర’ గురించి తెలుసుకుని దాని హిందీ వెర్షన్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండటంతో దానిపై ఓ లుక్కేయడంతో వ్యూస్ పెరిగాయి. దీనికి తోడు ‘మగధీర’ హిందీ రీమేక్ గురించి తరచుగా చర్చలు జరుగుతుండటం వల్ల కూడా దానిపై అక్కడి జనాల దృష్టి పడింది. ‘రాబ్తా’ సినిమా.. ‘మగధీర’కు కాపీ అని ప్రచారం జరగడం.. దీనిపై వివాదం నెలకొనడం కూడా కలిసొచ్చింది. ‘మగధీర’ హిందీ వెర్షన్ కు వ్యూస్ మోత మోగింది. మామూలుగానే హిందీలోకి డబ్ అయిన తెలుగు సినిమాలకు ఆదరణ పెరుగుతుండగా.. ‘మగధీర’కు మరిన్ని అంశాలు కలిసొచ్చి ఆ సినిమా మైండ్ బ్లోయింగ్ మైల్ స్టోన్ ను టచ్ చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/