సూపర్ స్టార్ మహేష్ దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న భారీ మల్టీస్టారర్ లో ఛాన్స్ తృణప్రాయంగా వదులుకున్నారు. జస్ట్ టేకిటీజీ అనుకున్నారు. అది కూడా ది గ్రేట్ మణిరత్నం దర్శకత్వంలో నటించే ఛాన్స్! .. అభిమానులకు దీనిపై అవగాహన ఉన్నా `నవాబ్` రిలీజ్ సందర్భంగా మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకుని, అరెరే ఎందుకని మహేష్ అలా చేశారు? అంటూ ఆరాలు తీస్తున్నారు. అసలింతకీ మహేష్ ఆ గ్రేట్ ఛాన్స్ ఎందుకు వదులుకున్నట్టు? ...
వాస్తవానికి మణిరత్నం ఈ సాహసోపేతమైన ప్రయత్నం మొదలుపెట్టే సమయానికి అతడి సీనే వేరు. కొన్ని వరుస డిజాస్టర్లు అతడి ఇమేజ్ ని దెబ్బ కొట్టాయి. ఆ క్రమంలోనే కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు.. అటు తమిళ స్టార్ హీరో విజయ్ - ఇటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఇద్దరినీ కలిపి దాదాపు 100కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ మల్టీస్టారర్ తెరకెక్కించాలని భావించారు. ఆ క్రమంలోనే సుహాసిని - మణిరత్నం ఇరువురూ హీరోలను కలిసి కథ కూడా వినిపించారు. తొలుత మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పుకార్లు షికారు చేశాయి. కానీ ఎందుకనో మహేష్ ఆ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తి చూపించలేదని తెలిసింది. మహేష్- విజయ్ మల్టీస్టారర్ పై రకరకాల పుకార్లు షికారు చేశాయి. చివరికి మహేష్ మణిరత్నం ప్రాజెక్టును కాదనుకుని శ్రీకాంత్ అడ్డాల `బ్రహ్మోత్సవం` చిత్రానికి కమిటయ్యారు. అదే క్రమంలో మురుగదాస్ తో `స్పైడర్` క్యూలోకి వచ్చింది. ఆ రెండు సినిమాల ఫలితం మాటేమో కానీ, మణి సర్ ప్రాజెక్టు మాత్రం వదులుకున్నది నిజం.
మహేష్ ఇలా బిజీ అయిపోతే, అటు విజయ్ సైతం అట్లీ - మురుగదాస్ లు వినిపించిన స్క్రిప్టులకు ఓకే చెప్పేశాడు. అయితే అప్పటికి మణి సర్ పరిస్థితి ఏమంత బాలేదు. సరైన సక్సెస్ కూడా లేకపోవడంతో ఇరువురు హీరోలు ముఖం చాటేశారని మాట్లాడుకున్నారు. కట్ చేస్తే తన పంతం నెగ్గించుకునేందుకు మణిరత్నం తన శిష్యుడైన అరవిందస్వామిని ఒప్పించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోకి శింబు - అరుణ్ విజయ్ లాంటి స్టార్లు వచ్చి చేరారు. జ్యోతిక - ప్రకాష్ రాజ్ లాంటి ప్రతిభావంతుల్ని బరిలో దించారు. అలా `నవాబ్` తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోంది. మొన్న రిలీజైన ట్రైలర్ - పోస్టర్లకు అద్భుత స్పందన వచ్చింది. దీంతో మరోసారి ఇలాంటి భారీ ప్రాజెక్టును మహేష్ - విజయ్ ఎందుకు వదులుకున్నారు? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాచరించువాడు సజ్జనుడు సుమతీ!!