ప్రమోషన్లకు రానందనే.. మహేష్‌ వద్దన్నాడా?

Update: 2016-07-09 06:29 GMT
ఆల్రెడీ ఇప్పటికే ఒక విధమైన కన్ఫర్మేషన్‌ వచ్చేసిందని అంటున్నారు సన్నిహితులు. త్వరలో ఏ.ఆర్.మురుగుదాస్ డైరక్షన్ లో హీరో మహేష్‌ చేయబోయే సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా చేయడం దాదాపు ఖాయమే. ఎందుకంటే అమ్మడు స్టోరీ కూడా వినేసి.. డేట్లను సర్దుబాటు చేసే విషయంలో కాస్త ఆలోచిస్తోందట. అది తప్పించి అన్నీ ఓకె.

అయితే ఈ ప్రాజెక్టు కోసం పరిణీతి చోప్రా 3.5 కోట్లు డిమాండ్‌ చేయడంతో.. రకుల్‌ అయితే 1 కోటి రూపాయలకు చేస్తోంది కాబట్టి.. ఆమెనే తీసుకున్నారని టాక్‌. అదంతా ఒకెత్తయితే.. అసలు ఈ ప్రాజెక్టు నుండి పరిణీతిని తప్పించడానికి మరో రీజన్ ఉందట. కరెక్టుగా ఈ సినిమా రిలీజ్ టైముకే అమ్మడు బాలీవుడ్‌ లో మరో సినిమా తాలూకు షూటింగ్‌ లో బిజీగా ఉంటుందట. హోమీ అడ్జానియా డైరక్షన్‌ లో 'తకదుమ్‌' అనే సినిమా చేస్తోంది పరిణీతి. ఈ సినిమాను టోటల్ గా యురోప్ లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ మానేసి మరీ తెలుగు సినిమా ప్రమోషన్లకు డేట్లు ఇవ్వాలంటే మాత్రం కష్టం అని చెప్పిందట. అందుకే అమ్మడిని తప్పించి.. రకుల్‌ ని తీసుకోమని మహేష్‌ సూచించినట్లు తెలుస్తోంది.

ఏదేమైనా కూడా.. ఈ మధ్య కాలంలో మహేష్‌ వంటి స్టార్‌ హీరో టైమ్ వేస్టు చేయకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఇలా కఠినమైన ప్లానింగ్ తో కుమ్మేయడం ఇండస్ర్టీకి చాలా మంచి విషయమే.
Tags:    

Similar News