జక్కన్న మౌనం..దేనికి సంకేతం?

Update: 2019-02-12 04:21 GMT
మన తెలుగు సినిమా చరిత్రని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళిన అతి కొద్ది మంది ట్యాలెంటెడ్ దర్శకుల్లో ఎస్.ఎస్ రాజమౌళి ఒకరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలితో రాజమౌళి తెలుగు సినిమా రేంజ్ ఎలా ఉంటుందో రుచి చూపించాడు. బాలీవుడ్ తో టాలీవుడ్ పోటీ పడుతూ బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి మన సత్తా ఏంటో బాహుబలితో రాజమౌళి బాలీవుడ్ కి తెలిసేలా చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి "ఆర్.ఆర్.ఆర్" అంటూ ఒక భారీ మల్టీ స్టారర్ కి ప్రాణం పోస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ సినిమా గురించి టాలీవుడ్ సర్కిల్స్ మొదలు కొని సోషల్ మీడియా వరకూ రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది.

ఆ వార్తల్లో భాగంగానే ఒక వార్త ఒకటి సినిమా సర్కిల్స్ లో తెగ చక్కెర్లు కొడుతుందట. అదేంటి అంటే, ఈ "ఆర్.ఆర్.ఆర్" సినిమాలో ఇద్దరు బడా హీరోలు ముఖ్య పాత్రల్లో ఉండడంతో ఈ పాత్రల కోసం బడా హీరోయిన్స్ ని వెతికే వేటలో పడ్డాడు రాజమౌళి. ఆ పనిలో భాగంగానే పరిణితీ చోప్రాను అడగగా...భారీగా డిమాండ్ చేసింది అని - అందుకే అంత పెట్టి ఆమెను పెట్టుకునే కన్నా - వేరే హీరోయిన్ కోసం వెతికే వేటలో పాడ్దాడట రాజమౌళి. ఇక ఆ కోవలోకి వచ్చిందే మన అలియ భట్ అట...ఇలా ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఉడికీ ఉడకని వార్తలు సోషిల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి.

అయితే వీటిపై రాజమౌళి ఎక్కడా స్పందిచకపోవడం ప్రేక్షకులకు లేని పోనీ అనుమానాలను రేకెత్తిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం - ఈ సినిమాకి మరింత బలం చేకూరేలా ప్రముఖ హిందీ నటుడు అజయ్ దేవగన్ ను సైతం రాజమౌళి పలు మార్లు కలిసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా అజయ్ ఏమైనా పాత్ర చేస్తున్నాడా అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఈ వార్తలపై అటు అజయ్ దేవగన్ కానీ - ఇటు రాజమౌళి కానీ ఎక్కడా నోరు విప్పడం లేదు...మరి వారి మౌనం అంగీకారమా? అర్ధాంగీకారమా? అన్నది అర్ధం కానీ పరిస్థితి. మరి జక్కన్న మనసులో ఏముందో...అది బయటకు ఎప్పుడు వస్తుందో తెలియాలి అంటే, ఆయన చెప్పే వరకూ వెయిట్ చెయ్యాల్సింది...చేద్దాం...చెయ్యక చస్తామా!

Tags:    

Similar News