సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన `2.ఓ` చిత్రం నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 3న ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ రాక కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇండియాలో, రిలీజైన అన్నిచోట్లా అన్ని రికార్డుల్ని బ్రేక్ చేసే ఏకైక సినిమా వస్తోందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే కరణ్ జోహార్ సమర్పణలో అంటూ పోస్టర్లను ముద్రించారు. హిందీ థియేట్రికల్ రైట్స్ కి 80కోట్లు - శాటిలైట్ వగైరా 110కోట్లు పలికిందన్న సమాచారం ఉంది.
అయితే 2.ఓ తెలుగు వెర్షన్ రైట్స్ విషయంలో మాత్రం బోలెడంత మెలో డ్రామా నడవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇది ఇరువురి చేతులు మారడం సర్వత్రా చర్చకొచ్చింది. ఈ భారీ చిత్రాన్ని ఏషియన్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ గత ఏడాది ఏపీ - నైజాం రిలీజ్ చేసేందుకు హక్కుల్ని కొనుక్కున్నారని ప్రచారమైంది. 90కోట్లకు బేరం కుదిరితే ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చారని మాట్లాడుకున్నారు. అయితే ఊహించని రీతిలో 2.ఓ రిలీజ్ తేదీ పలుమార్లు వాయిదా పడడంతో సదరు పంపిణీదారుపై ఆర్థిక వ్యవహారాల పరంగా తీవ్ర ఒత్తిడి నెలకొందిట. దాంతో ఏషియన్ అధినేత ఇచ్చిన అడ్వాన్సుల్ని వెనక్కి తీసుకున్నారు.
ఆ తర్వాత కూడా సునీల్ నారంగ్ కే 2.ఓ హక్కులు లైకా సంస్థ కట్టబెట్టనుందన్న ప్రచారం సాగింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కుల్ని ప్రఖ్యాత ఎన్ విఆర్ ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఛేజిక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అసలింతకీ ఎన్ విఆర్ అంటే ఎవరు? అంటే.. ఈ సంస్థ ఇప్పటికే పలు క్రేజీ అనువాద చిత్రాల్ని తెలుగులో రిలీజ్ చేసింది. ఇదివరకూ లైకా సంస్థకే చెందిన కాలా - కణం వంటి చిత్రాలకు రిలీజ్ విషయంలో బ్యాకప్ ఇచ్చింది ఈ సంస్థనే. తిరుపతికి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్ వి ప్రసాద్- దిల్ రాజు- యువి క్రియేషన్స్ వంశీ త్రయం కలిసి పెట్టుకున్న ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక చిత్రాల్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే 2.ఓ ఏపీ-నైజాం ఓవరాల్ డీల్ ఎంత? అన్నది మాత్రం తెలియాల్సి ఉందింకా. అంత కథ ఉందన్నమాట.