సౌత్ లో బాహుబలి తరువాత భారీ బడ్జెట్ తో 8 వ శతాబ్ధం లో జరిగిన ఒక వర్గ పోరాటంను శృతి హాసన్ ప్రధాన పాత్రలో 'సంఘమిత్ర'గా తీసుకురావాలని తమిళ తంబీలు ప్లాన్ వేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో కూడా శృతి హాసన్ గుర్రం మీద యుద్దం చేస్తునట్లు ఉన్న ఫ్యాంటసీ పోస్టర్ ను కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదల చేశారు. కాని హఠాత్తుగా ఈ సినిమా నుండి శృతి తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్లు సుమారుగా రెండేళ్ళు డేట్స్ పూర్తిగా అడిగినట్లు తెలుస్తోంది. పైగా శ్రుతికి ఇంతవరకు బౌండెడ్ స్క్రిప్ట్ ఇవ్వలేదట. అసలు కథ మరియు డేట్స్ డీటైల్స్ కూడా సరిగా చెప్పలేదట. అందుకే అమ్మడు తప్పుకుంది అంటున్నారు సన్నిహితులు. శ్రుతి ఈ ప్రాజెక్టు కోసం చాలా కమ్మిట్మెంట్ తో ఉంది. గుర్రపు స్వారీ ట్రైనింగ్ నుండి కత్తి ఫైటింగ్ వరకు బాగానే ట్రైనింగ్ తీసుకుంది. ఒక రేంజులో ట్రైనింగ్ అంతా పూర్తయ్యాక ఇప్పుడు సినిమా నుండి డ్రాప్ అవ్వడం అంటే.. డేట్స్ అండ్ కథ ఒక్కటే కారణమంటారా?
సుందర్ సి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇరకాటంలో పడినట్లే. ఇప్పుడు ఈ పాత్రను చేసే వారు ఎవరు అనేది చాలా ఇంట్రెస్ట్ గా మారింది. మరి ఎప్పుడూ రీప్లేస్ మెంట్ కు రెడీగా తమన్నాఈ పాత్రలోకి దూకుతుందా? అసలు ఒక సంవత్సరం డేట్లు కావాలంటే.. దాదాపు 5 కోట్ల పైనే చాలామంది స్టార్ హీరోయిన్లు కోట్ చేస్తున్న ఈ రోజుల్లో.. తప్పిన శృతి స్థానంలో మరో అపశృతి జరగకుండా చూసుకోవడం కాస్త కష్టమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/