ఇంతకీ విషయం ఏంటంటే.. నిన్న జరిగిన ''సన్ ఆఫ్ సత్యమూర్తి'' సినిమా ఆడియో లాంచ్‌లో మనకు ఓ అరుపు ఎక్కువగా వినిపించిందా అంటే లేదనే అంటున్నారు జనాలు. మామూలుగా ఏ మెగా హీరో ఆడియో లాంచ్‌లో అయినా సరే మనం ''పవర్‌స్టార్.. పవర్‌స్టార్..'' అనే అరుపులూ, కేకలూ వింటూనే ఉంటాం. దానికి మన మెగా హీరోలు ఏదో ఒకటి సర్దిచెబుతూనే ఉంటారు. అయితే నిన్నటి కార్యక్రమంలో ఈ అరుపులు అంతగా లేవు. కారణం ఏంటంటారు?
నిజానికి మెగా ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడూ శిల్పకళావేదికలో జరుగుతాయి. అయితే ఈసారి మాత్రం ఆ ఫంక్షన్‌ను హైటెక్స్‌లో పెట్టారు. అక్కడే ఉన్న ఆడిటోరియంలో సీటింగ్ ఏర్పాట్లు చేసి ఫంక్షన్ చేశారు. శిల్పకళావేదికలో అయితే సీట్లు రెడీగా ఉంటాయికాని.. ఇక్కడ మాత్రం ఏర్పాటు చేయాల్సిందే. అసలు ఇక్కడ ఫంక్షన్‌ను పెట్టడానికి కారణమే ఈ పవర్‌స్టార్ అరుపులు కంట్రోల్ చేయడానికా అనే సందేహం వస్తోంది ఇప్పుడు. శిల్పా కళావేదికలో అయితే, ఫ్యాన్స్ చాలా దగ్గరగాకూర్చోవడం వలన వారు పవర్‌స్టార్ అని అరిస్తే తెగ వినిపించేది. కాని హైటెక్స్‌లో మాత్రం వారి గ్యాలరీని దూరంగా పెట్టడం వలన వారు ఎంత అరిచినా పెద్దగా వినబడలేదు. వారి అరుపులను మైక్‌లు క్యాచ్ చేయలేదు అంటున్నారు చూపరులు. మరి దీనిలో ఎంతవరకు నిజమో తెలియదు.