ఇష్టపడి ఇచ్చారా? భయపడి ఇప్పించారా??

Update: 2018-03-28 17:30 GMT

ఇప్పుడు టాలీవుడ్ అంతా కూడా సెన్సేషన్లు క్రియేట్ చేయడమే పనిగా మారిపోయింది. మొన్నటివరకు కొందరు నిర్మాతలమో హీరోల గురించి చెబుతాం అంటూ టివి ఇంటర్యూలకు ఎక్కారు. ఆ తరువాత కొంతమంది హీరోయిన్లు ఏకంగా క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. చాలామంది పడుకోమన్నారంటూ పచ్చిగానే చెబుతూ.. కొందరి పేర్లను బయటపెడతాం అంటూ హంగామా చేస్తున్నారు. ఇక కొందరు జర్నలిస్టులు పచ్చిగానే టాలీవుడ్ కు రంకు అంటగట్టేస్తున్నారు.

ఈ సమయంలో ఒక దర్శకుడు.. సదరు ఆరోపణలు చేస్తున్న ఒక నటీమణికి ఆఫర్ ఇవ్వడం అనేది టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఆ దర్శకుడికి చాలా మంచి పేరే ఉన్నప్పటికీ.. ఈ సుందరికి ఆఫర్ ఇస్తున్నా అనగానే.. అసలు ఇష్టపడే ఇచ్చారా? లేదంటే ఎవరైనా భయపడి ఇప్పించారా? అనే సందేహాలు వచ్చేస్తున్నాయి. నిజానికి ఆమె ఒక ప్రొడ్యూసర్ కొడుకు పేరు బయటపెడతానంటూ హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఆ ప్రొడ్యూసరే ఇదంతా తెలుసుకుని.. ఆమె నోరు తెరిస్తే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భయపడి.. ఆమెకు ఒక ఆఫర్ ఇస్తే సైలెంట్ అయిపోతుందిలే అనుకుని.. ఇలా సదరు దర్శకుడి ద్వారా ఆఫర్ ఇప్పించాడని ఒక రూమర్ వినిపిస్తోంది.

కాని మరోవైపు ఏంటంటే.. పైకి చాలా కరుకుగా కనిపించినా కూడా చాలా సున్నితమైన మనస్సు కలిగిన సదరు డైరక్టర్.. ఇప్పటికే తను లాంచ్ చేసిన ఒక హీరో డిప్రెషన్ లో ప్రాణాలు తీసుకోవడం కూడా చూశాడు కాబట్టి.. తనే ఈ అమ్మాయికి పిలిచి ఆఫర్ ఇచ్చుంటాడని అంటున్నారు. అది సంగతి.
Tags:    

Similar News