యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ స్టయిలే వేరు. అతనేం చేసినా భిన్నంగా ఉంటుంది. తన అభిమానుల్ని ‘రౌడీస్’ అని చిత్రమైన పిలుపుతో పిలుస్తాడతను. ఏ వేదిక ఎక్కినా వాట్సాప్ రౌడీ బాయ్స్ అంటూ అతను అభిమానుల్ని పలకరించే తీరే వేరుగా ఉంటుంది. ముందు ఇదేదో ఒకట్రెండు సార్లు అనుకోకుండా పిలిచిన పిలుపని అంతా అనుకున్నారు. కానీ అతనెప్పడూ అభిమానుల్ని రౌడీస్ అనే పిలుస్తున్నాడు. ‘రౌడీ’ పేరుతో ఒక దుస్తుల బ్రాండ్ కూడా మొదలుపెట్టి.. దాన్ని మార్కెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి విజయ్ పర్టికులర్ తన అభిమానుల్ని ‘రౌడీస్’ అని పిలవడానికి కారణమేంటి? ఈ ప్రశ్నకు తాజాగా అతను సమాధానం ఇచ్చాడు.
తనను అభిమానించే వాళ్లది తన వయసే అని.. కొన్నేళ్ల కిందటి వరకు తాను కూడా వాళ్ల లాగే కాలేజీల్లో చదువుకునేవాడినని.. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి గుర్తింపు తెచ్చుకున్నానని విజయ్ చెప్పాడు. ఈ మాత్రానికే తానేదో పెద్ద వాడిని అయిపోయినట్లు భావించడం లేదని..తన లాంటి కుర్రాళ్లను ఫ్యాన్స్ అని పిలవడం తనకు ఇష్టం లేదని.. అందుకే వాళ్లను సరదాగా రౌడీస్ అంటుంటానని విజయ్ చెప్పాడు. ఐతే చిన్న వయసు కుర్రాళ్లే ఇప్పుడు ‘గీత గోవిందం’ పైరసీని వ్యాప్తి చేస్తుండటం.. కొందరు అరెస్టు కూడా కావడం తనకెంతో బాధ కలిగించిందని.. స్టూడెంట్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని.. జీవితాలు పాడు చేసుకోవద్దని అతను కోరాడు.