వివ‌క్ష కార‌ణంగానే RRR ని సెలెక్ట్ చేయ‌లేదా?

Update: 2023-01-21 13:11 GMT
గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాల్లో రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన  RRR స‌త్తా చాటింది. `నాటు నాటు` సాంగ్ కు గానూ బెస్ట్ ఒరిజిన‌ల్ మ్యూజిక్ విభాగంలో అవార్డుని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో యావ‌త్ దేశ వ్యాప్తంగా సెల‌బ్రిటీలు, ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు సైతం RRR ఆస్కార్ అవార్డు ని ద‌క్కించుకునే క్ష‌ణాల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌న దేశం నుంచి ఆస్కార్ కు RRRతో పాటు మొత్తం ప‌ది సినిమాలు పోటీప‌డుతున్నాయి. ఇదిలా వుంటే ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఆస్కార్ అవార్డుల కీల‌క ఓటింగ్ ప్ర‌క్రియ ముగిసింది.

దాదాపు 89 దేశాల‌కు చెందిన అకాడ‌మీ స‌భ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొని త‌మ‌కు న‌చ్చిన సినిమాల‌కు, న‌టీన‌టుల‌కు ఓటు వేశారు. అయితే మిగ‌తా ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఓటింగ్ కు అత్య‌ధిక ప్రాధాన్య‌త వున్న‌ట్టుగా తెలుస్తోంది. కార‌ణం ఈ ఏడాది ఎక్కువ మంది స‌భ్యులు ఓటీంగ్ లో పాల్గొన్నార‌ని తెలుస్తోంది. 95 ఏళ్ల ఆస్కార్ చ‌రిత్ర‌లో ఈ స్థాయిలో ఓటింగ్ జ‌ర‌గ‌డం ఇదే తొలిసార‌ని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని అకాడ‌మీ స‌భ్యులు ప్ర‌త్యేకంగా వెల్ల‌డించ‌డం విశేషం.

ఇప్ప‌టికే RRR గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారంతో పాటు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో రెండు విభాగాల్లో అవార్డుల్ని ద‌క్కించుకుంది. ఇక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ స‌ర్కిల్ విభాగంలోనూ పోటీప‌డి మ‌రో అవార్డుని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

అంతే కాకుండా హాలీవుడ్ దిగ‌గ్జ ద‌ర్శ‌కులు స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్‌, జేమ్స్ కామెరూన్ ల ప్ర‌శంస‌ల్ని సైతం సొంతం చేసుకుని ఆస్కార్ రేస్ లో హాట్ ఫేవ‌రేట్ గా నిలిచింది. ఇప్ప‌టికే ఆస్కార్ అవార్డుల రేసులో ప‌లువురు ప్ర‌ముఖుల‌ని వెన‌క్కి నెట్టి ఎన్టీఆర్ ఉత్త‌మ న‌టుడు కేట‌గిరిలో దూసుకుపోతున్నాడంటూ న్యూ య‌ర్క్ టేడే వెల‌ల్డించ‌డం విశేషం.  

ఇదిలా వుంటే RRR కు ప్ర‌ఖ్యాత బాఫ్టా అవార్డుల్లో చోటు ద‌క్క‌క‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప్ర‌ముఖ హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు RRR పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న వేళ బాప్టా అవార్డుల్లో RRRకు చోటు ద‌క్క‌క‌పోవ‌డంపై పలు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. నాన్ ఇంగ్లీష్ చిత్రాల విభాగంలో RRR కు చోటు ద‌క్కాల్సింది కానీ ఎందుకు ద‌క్క‌లేద‌నే చ‌ర్చ మొద‌లైంది. బ్రిటీష్ అకాడ‌మీ ఫిల్మ్ అవార్డ్స్ అయిన బాఫ్టాలో RRR కు చోటు ద‌క్క‌పోవ‌డానికి వివ‌క్ష‌నే కార‌ణంగా చెబుతున్నారు.

ఇది పూర్తిగా ఆంగ్లేయుల‌కు అంటే బ్రిటీష్ వారికి వ్య‌తిరేకంగా తీసిన సినిమా. భార స్వాతంత్య్రం కోసం ఇద్ద‌రు వీరులు చేసిన పోరాటం నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు. సినిమాలో బ్రిటీష్ వారిని ఊచ‌కోత కోయ‌డం తెలిసిందే. ఇదే బ్రిటీష్ అకాడ‌మీ వారికి పెద్ద‌గా న‌చ్చ‌లేద‌ని, ఆ వివ‌క్ష కార‌ణంగానే RRR ని బాఫ్టా పుర‌స్కారాల్లో నాన్ ఇంగ్లీష్ మూవీస్ కేట‌గిరీలో ఎంపిక చేయ‌లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం బ్రిట‌న్‌ ప్ర‌ధాని భార‌తీయ సంత‌తికి చెందిన వ్య‌క్తే అయినా బ్రిటీష్ వారి ఈగోని హ‌ర్ట్ చేయ‌డం వ‌ల్లే RRR ని బాఫ్టాలో చోటు ద‌క్క‌క‌పోయి వుండొచ్చ‌ని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News