కరోనా ధాటికి దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. జనాల అంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఖాళీగా ఉంటున్న జనాల కోరిక మేరకు దూరదర్శన్ లో అప్పట్లో ఎంతో హిట్ అయిన 'రామాయణం' సీరియల్ ను కేంద్ర ప్రభుత్వం ప్రసారం చేస్తోంది.
ఈ శని, ఆదివారాల్లో రామాయణం సీరియల్ ప్రసారమైంది. ఉదయం, రాత్రి 9 గంటలకు ప్రసారమైన ఈ దారావాహికకు తాజాగా అద్భుతమైన స్పందన వచ్చింది.
శనివారం ప్రసారమైన ఈ ఎపిసోడ్స్ కు ఏకంగా 34 మిలియన్స్ వ్యూస్ వచ్చినట్టు బార్క్ లెక్కలు చెబుతున్నాయి.
ఇక ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్స్ ను ఏకంగా 51 మిలియన్స్ మంది చూశారు. ఇది కొన్నేళ్లుగా ఓ సీరియల్ కు వచ్చిన వీక్షణల్లో గొప్ప రికార్డ్. దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ సీరియల్ కు రాని వ్యూస్ రామాయణ్ కు వచ్చాయి. ఏకంగా రెండు ఎపిసోడ్స్ కు 85మిలియన్ వ్యూస్ దక్కడం గమనార్హం. ఇలా లాక్ డౌన్ వేళ జనాలు టీవీలకు అతుక్కుపోతున్న వైనం వెలుగుచూస్తోంది.