ఫోటో స్టోరీ : అరవింద - వీర రాఘవ రొమాన్స్‌

Update: 2018-09-29 16:36 GMT
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మూవీ అంటూ మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ దసరాకు వీరిద్దరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అరవింద సమేత అంటూ తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా - తన ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్స్‌ మిస్‌ కాకుండా - యాక్షన్‌ సీన్స్‌ కు ఇంకాస్త మసాలా దట్టించి త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ చిత్రంలోని రెడ్డి ఇక్కడ సూడు... అంటూ సాగే రొమాంటిక్‌ పాట నుండి పోస్టర్‌ ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్‌ లో హీరోయిన్‌ పూజా హెగ్డే మరియు ఎన్టీఆర్‌ లు చాలా రొమాంటిక్‌ ఫోజ్‌ లో ఉన్నారు. త్రివిక్రమ్‌ మూవీలో రొమాన్స్‌ కాస్త తక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు. ఆ లోటును ఈ చిత్రంతో పూర్తి చేయాలని దర్శకుడు త్రివిక్రమ్‌ కాస్త ఎక్కువ రొమాంటిక్‌ గా ఈ పాటను చిత్రీకరించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు నాలుగు పాటలు వచ్చాయి. ఆ పాటల్లో ఇది మాత్రమే రొమాంటిక్‌ డ్యూయెట్‌. మిగిలిన వాట్లో రొమాన్స్‌ అస్సలు స్కోప్‌ ఉండదు. అందుకే ఈ సాంగ్‌ లో మోతాదుకు మించి రొమాన్స్‌ ను లీడ్‌ పెయిర్‌ మద్య పుట్టించేందుకు త్రివిక్రమ్‌ ప్రయత్నించినట్లుగా ఈ పిక్‌ చూస్తుంటే అనిపిస్తుంది. యాక్షన్‌, కామెడీ, రొమాన్స్‌ ఇలా అన్ని కూడా సమపాళ్లలో ఉండే ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News