చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. చరణ్ - నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొంతకాలం క్రితం మలయాళంలో విజయాన్ని సాధించిన 'లూసిఫర్' కి ఇది రీమేక్. ఈ సినిమాలో నయనతార .. సత్యదేవ్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇక మలయాళంలో మంజూ వారియర్ పోషించిన పాత్ర కోసం సీనియర్ నటి శోభనను తీసుకోనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ స్థానంలో ముచ్చర్ల అరుణ పేరు వినిపిస్తోంది.
ముచ్చర్ల అరుణ పేరు వినగానే 'సీతాకోకచిలుక' సినిమా పేరు గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో కలువపూల వంటి కళ్లతో ఆమె చేసిన అల్లరి గుర్తుకు వస్తుంది. అప్పటికీ ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ప్రేమకథల్లో ఇది ముందు వరుసలోనే కనిపిస్తుంది.
ఆ సినిమా తరువాత ఓ పదేళ్లపాటు ఎన్నో సినిమాల్లో ముచ్చర్ల అరుణ ముఖ్యమైన పాత్రలను పోషించింది. అదే సమయంలో తమిళ .. మలయాళ .. కన్నడ చిత్రాల్లోను ఆమె నటించింది. 1990 తరువాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. పెళ్లి తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
అంటే .. 30 ఏళ్లుగా ఆమె సినిమాలు చేయలేదు. అలాంటి ముచ్చర్ల అరుణ పేరు మళ్లీ ఇంతకాలానికి 'గాడ్ ఫాదర్' సినిమా కోసం వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం చాలా మంది సీనియర్ హీరోయిన్స్ పేర్లను పరిశీలించారు. చివరికి శోభన అయితే బాగుంటుందని అనుకున్నారు.
గతంలో ఆమె చిరంజీవి .. మోహన్ బాబు వంటి స్టార్స్ తో హిట్ సినిమాలు చేసింది. తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను మరిచిపోలేదు. అందువలన ఈ పాత్రకి ఆమె అయితే కొత్తగా ఉంటుందని భావించారు.
మరి శోభన చేయనని చెప్పిందా? లేదంటే ఆమె అందుబాటులో లేదా? అనే విషయం తెలియదుగానీ, తెరపైకి ముచ్చర్ల అరుణ పేరు వచ్చింది. ఆమె హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేదుగానీ, నటన విషయంలో వంక బెట్టవలసిన పనిలేదు. 'సంసారం ఒక చదరంగం' .. 'ఆడదే ఆధారం' సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. అందువలన ఆమెను సంప్రదించడం జరిగిందనే ఒక టాక్ వినిపిస్తోంది. దాదాపు ఆమెనే ఖరారు కావొచ్చని అంటున్నారు.
త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రావచ్చు.