కుర్ర హీరో కోసం రెజీనా గ్లామర్

Update: 2016-05-09 05:13 GMT
యంగ్ హీరో సందీప్ కిషన్ కి టాలీవుడ్ లో బాగా పరిచయాలు ఎక్కువ. ముఖ్యంగా కుర్ర హీరోయిన్లతో మహా క్లోజ్ ఈ కుర్రాడు. దాదాపు ఒకే టైంలో ఎంట్రీ ఇచ్చిన వాళ్లు కావడంతో.. యంగ్ హీరోయిన్స్ అంతా సందీప్ కిషన్ కి మంచి ఫ్రెండ్స్. రకుల్ ప్రీత్ సింగ్ - రెజీనా కసాండ్రా.. ఇలా అమ్మాయిలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తూ ఉంటాడు ఈ యంగ్ హీరో. ఈ ఫ్రెండ్ షిప్ ని ఫిలిం ప్రమోషన్స్ కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు యంగ్ జనరేషన్.

సందీప్ కిషన్ - నిత్యా మీనన్ జంటగా నటించిన 'ఒక అమ్మాయి తప్ప' మూవీ ఆడియో లాంఛ్ జరిగింది. ఈ ఈవెంట్ కి మూవీలో హీరోయిన్ నిత్యా మీనన్ వచ్చినా.. రెజీనా కూడా వచ్చి బోలెడంత గ్లామర్ ధారపోసింది. వివి వినాయక్ - బోయపాటి లాంటి దర్శకులు కూడా ఆడియో లాంఛ్ కి వచ్చినా.. రెజీనా మాత్రం గ్లామర్ డోస్ బాగా అట్రాక్షన్ అయింది.

అసలింతకీ ఈ ఈవెంట్ కి రెజీనాకి మధ్య లింక్ సందీప్ కిషన్ ఒక్కడే. ఆఫ్ స్క్రీన్ లో బాగా ఫ్రెండ్లీగా ఉండే ఈ కుర్ర హీరో బాగా ఎనర్జిటిక్. సర్కిల్ ని మెయింటెయిన్ చేయడంలో కూడా దిట్ట. అలా తన సినిమాల ప్రమోషన్స్ కి క్రేజ్ హీరోయిన్స్ ని గెస్టులుగా పిలుస్తూ ఉంటాడు. నిత్యా లాంటి టాలెంటెడ్ పెర్ఫార్మర్ ఉన్నా.. ఆడియో వేడుకలో గ్లామర్ కోసమే రెజీనాని పిలిచాడని టాక్.

Tags:    

Similar News