'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది రెజీనా కసాండ్రా. 'రొటీన్ లవ్ స్టోరీ' 'పిల్లా నువ్వు లేని జీవితం' 'సుబ్రమణ్యం ఫర్ సేల్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోయిన్ అనిపించుకోక పోయినా తన అందచందాలతో కొన్నేళ్ల పాటు కుర్రకారుని ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తుంది. నిన్న (డిసెంబర్ 13) తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్తూ ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.
బర్త్ డే నాడు ఎంతో ప్రేమను కనబరిచిన మీకు నా కృతజ్ఞతలు.. అయితే చాలా మందికి నేను సమాధానం ఇవ్వలేక పోతున్నందుకు చాలా బాధగా ఉందని వెల్లడిస్తూ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఫస్ట్ ఫోటో పై 'స్వైప్ లెఫ్ట్ ఫర్ న్యూడ్స్' అనే క్యాప్షన్ రాసి పెట్టింది. దీంతో ఫొటోను ఎడమ చేతి వైపుకి స్వైప్ చేస్తే ఏవో పిక్స్ ఉంటాయని ఆశగా చూసిన వారు మాత్రం నిరాశకు గురయ్యారు. ఎందుకంటే పక్కన ఉంది రెజీనా చిన్నప్పటి ఫొటోలు. ఇందులో రెజీనా స్మైల్ ఇస్తూ క్యూట్ గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.