పిక్‌టాక్ : ఫ్యామిలీతో పుష్పరాజ్ సంక్రాంతి వేడుక
పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్‌లను బద్దలు కొట్టిన అల్లు అర్జున్ సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీతో సరదా సమయంను గడిపాడు.
పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్‌లను బద్దలు కొట్టిన అల్లు అర్జున్ సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీతో సరదా సమయంను గడిపాడు. దాదాపు నాలుగు ఏళ్లుగా పుష్ప సినిమా కోసం పెంచిన గడ్డం, జుట్టుతో కనిపించిన అల్లు అర్జున్ ఎట్టకేలకు రెగ్యులర్ లుక్‌లోకి వచ్చాడు. అల వైకుంఠపురంలో సినిమాలో ఎలా అయితే కనిపించాడో అలాగే ఇప్పుడు కనిపిస్తున్నాడు. తాజాగా సంక్రాంతి రోజు ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. స్నేహా రెడ్డి, అల్లు అర్జున్‌లతో పాటు అర్హ, అయాన్‌లను ఈ ఫోటోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో ఈ సంక్రాంతి స్పెషల్ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటో జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. పుష్ప రాజ్ ఫ్యామిలీ ఫోటో చూడండి అంటూ నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా అర్హ చాలా ముద్దుగా ఉంది, ఎంత క్యూట్‌గా ఉందో అంటూ అర్హకి కామెంట్స్ వస్తున్నాయి. అర్హ ముద్దు ముద్దు మాటలతో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. అప్పుడే ఇంత పెద్ద పాప అయ్యిందా అంటూ కొందరు ఆశ్చర్యంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అయాన్ సైతం పెద్ద వాడు అవుతున్నాడు. తండ్రి అల్లు అర్జున్ భుజాల వరకు వచ్చేశాడు. మరికొన్ని రోజుల్లో బుల్లి పుష్ప రాజ్ కాస్త పుష్ప రాజ్ సినిమా సీక్వెల్ లేదా రీమేక్‌కి హీరో మాదిరిగా మారినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ రేంజ్‌లో అందంగా ఉండే స్నేహా రెడ్డి మరోసారి అదే ప్రశంసలు అందుకుంటున్నారు. స్నేహ బాలీవుడ్‌కి చెందిన ఎంతో మంది హీరోయిన్స్‌తో పోల్చితే ఎక్కువ అందంగా కనిపిస్తారని, హీరోయిన్‌గా నటించకున్నా సోషల్ మీడియాలో ఆమె అందానికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే హీరోయిన్స్ రేంజ్‌లో స్నేహా రెడ్డిని సోషల్ మీడియా ద్వారా ఫాలో అవుతూ ఉంటారు.
పుష్ప 2 సినిమా రూ.2000 కోట్ల వసూళ్ల వైపు అడుగులు వేస్తుంది. నార్త్ ఇండియాలో ఇంకా కొన్ని థియేటర్‌లలో సినిమా ఆడుతూనే ఉంది. కనుక ఆ మ్యాజిక్ నెంబర్‌ని దాటడం అసాధ్యం అయితే కాదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలైన బాలుడు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇటీవలే అల్లు అర్జున్ వెళ్లి బాలుడిని పరామర్శించి వచ్చాడు. మరో వైపు అల్లు అర్జున్‌తో సినిమా కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక డబుల్ హ్యాట్రిక్ కోసం వీరిద్దరి కాంబో రాబోతుంది.