వామ్మో రెజినా లుక్ ఏంటి.. కొంపదీసి ఆ లుక్కేనా..?

Update: 2020-05-22 14:30 GMT
రెజినా కెసెండ్రా. తెలుగు ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. చెన్నైలో పుట్టి పెరిగి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటగా తమిళంలోనే హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. తెలుగులో ఎస్ఎంఎస్ సినిమాతో తన సినీ కెరీర్ ని ప్రారంభించి తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో మంచి ఫామ్ ని కంటిన్యూ చేసింది. మొదటి నుండి గ్లామర్ షోకి వెనుకాడని రెజినా నక్షత్రం, మిస్టర్ చంద్రమౌళి సినిమాలలో విపరీతంగా అందాలను ఆరబోసింది. ఈ మధ్యే కెరీర్ లో ఊపు తగ్గిన రెజినా రీసెంట్ గా చిరంజీవి 'ఆచార్య' సినిమా ఐటమ్ సాంగ్ లో చిందేసిందట. ఇక సినిమాలు తక్కువ ఉండటంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరించడానికి సిద్ధమైంది.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రెజీనా ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. ఈమె మేకోవర్ చూసి వామ్మో అనుకుంటున్నారు. ఏమైంది ఇలా అయిపోయింది.. సినిమాలు లేకపోయేసరికి పూర్తిగా మేకోవర్ అయిపోయిందా ఏంటి అనుకుంటున్నారు. మొదటి సారి చూడగానే.. ఎవరికైనా ఈమె ఎవరు ఇలా భయంకరంగా ఉంది? అని అడగక మానరు. ఇది రెజినా కొత్త స్టైల్ అంట. రెట్రో స్టైల్ లో ఈ అమ్మడు లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పాత కాలపు ఫారిన్ భామల తరహాలో రెజినా మేకప్, లుక్స్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ హీరోయిన్ గా డీసెంట్ లుక్స్ లో కనిపించే రెజినా.. ఈ న్యూ లుక్కులో పెద్దగా ఆకట్టుకోలేక పోయిందనే చెప్పాలి. దీంతో రెజినా ఫోటోలని నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ మెగాస్టార్ తో ఆచార్యలో ఐటమ్ సాంగ్ చేసింది కాబట్టి.. కొంపదీసి ఆ సాంగ్ లోని లుక్ క్లూ ఇచ్చిందేమో అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.


Tags:    

Similar News