అందచందాలు.. ఆకట్టుకునే రూపం.. అభినయంలో అదరగొట్టడం హీరోయిన్ రెజీనా కెసాండ్రాకు ప్లస్ పాయింట్లు. సినిమాల్లో అవకాశాలకు లోటు లేకపోయినా కెరీర్ లో బ్లాక్ బస్టర్ అంటూ లేకపోవడం ఈ భామకు పెద్ద లోటేనని చెప్పాలి. ఎన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు చేసినా అన్నీ వేస్టయిపోయాయి తప్ప ఆమె ఆశించిన కమర్షియల్ హిట్ మాత్రం అందని ద్రాక్షగానే ఉండిపోయింది. కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన నక్షత్రం కెరీర్ ను టర్న్ తిప్పుతుందని ఆశపడి అందాలన్నీ ఆరబోసినా ఆ సినిమా తుస్సుమంది.
ఇలాంటి రెజీనాకు తన టాలెంట్ చూపే ఛాన్స్ ‘ఆ’ సినిమాతో వచ్చింది. నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో రెజీనాను చూసిన వారంతా ఉలిక్కిపడాల్సి వచ్చింది. ఇంతకుముందెన్నడూ ఎప్పుడూ ఎవరూ ఆమెను ఆ అవతారంలో చూడలేదు. ఫంకీ హెయిర్ స్టయిల్.. ముక్కు కింద భాగంలో పోగులు.. ఒళ్లంతా టాటూలతో అబ్బో చాలా వెరైటీగా కనిపించింది. ఈ గెటప్ రావడానికి ఆమె స్టయిల్ టీం 24 గంటలపాటు శ్రమించాల్సి వచ్చిందట. ‘‘ఈ సినిమాలో నా రోల్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. కాస్తంత విలనీ షేడ్స్ కనిపిస్తాయి. ఈ గెటప్ ఓకే చేయడానికి ముందు ఎలా ఉంటే బాగుంటుందనే దానిపై నా స్టయిలిస్ట్.. టాటూ డిజైనర్లు తెగ రీసెర్చ్ చేశారు. కచ్చితంగా ఈ లుక్ ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తుందని తెలుసు. జులైలోనే ఈ మేకప్ వేసుకున్నా చాలా రోజులపాటు సీక్రెట్ గా ఉంచాం. ఈ సినిమా నన్ను నటిగా మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నా’ అని రెజీనా చెబుతోంది.
కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ సిద్ధం చేసిన ‘అ’ కథ నచ్చి నిర్మించేందుకు నాని రెడీ అయ్యాడు. వాల్ పోస్టర్ బ్యానర్ తో తీస్తున్న ఈ మూవీలో రెజీనాతోపాటు కాజల్ నిత్యమేనన్ అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నారు. ఇందులో మొక్కకు మాస్ మహరాజా రవితేజ.. చేపకు నాని వాయిస్ ఓవర్ అందివ్వనుండటం విశేషం.