పక్కింటి అమ్మాయి అనకండి, మండుతోంది

Update: 2015-07-30 20:29 GMT
చాలా తక్కువ టైమ్‌ లో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న కథానాయిక రెజీన. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకూ.. ఎవరితో అవకాశం వచ్చినా కాదనకుండా నటించింది. కెరీర్‌ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతోంది. మాస్‌ మహారాజ్‌ రవితేజ సరసన పవర్‌ చిత్రంలో కథానాయికగా నటించిన ఈ భామ ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ సరసన సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ చిత్రంలో నాయికగా ఆడిపాడుతోంది. గోపిచంద్‌, మనోజ్‌ సరసన వరుసగా సినిమాల్లో నటిస్తోంది.

అయితే ఈ అమ్మడు ఓ విషయంలో చాలా సీరియస్‌ అవుతోంది. తనని ఎవరైనా పక్కింటి అమ్మాయి అని పిలిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేకపోతోంది. అసలు నన్ను ఎందుకలా అన్‌ పాపులర్‌ చేస్తారు? నాపై పరిమితులు ఎందుకు విధిస్తారు? అంటూ చిర్రెత్తిపోతోంది. నేను గ్లామరస్‌ పాత్రలకు పనికిరాను అని రాస్తున్నారు. కానీ ఇప్పుడు నేను పరిణతి చెందిన నటిని. అన్నిరకాలుగా నిరూపించుకునే సత్తా నాకు ఉంది. గ్లామర్‌ ని ఆవిష్కరించడానికి అవసరమైన సరంజామా నా దగ్గర అందుబాటులో ఉంది.. అని చెబుతోంది.

పక్కింటి అమ్మాయి అని ఎవరైనా అంటే అది కరెక్టు కాదు అని నిరూపించడానికి ఇంకెంతో సమయం లేదు.. అని ఛాలెంజ్‌ విసురుతోంది.
Tags:    

Similar News