ఓహో రెజీనా.. అంత లాగేశావా?

Update: 2016-01-11 22:30 GMT
గల్ఫ్ కంట్రీస్‌ లో తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే ఆశ్వినీ కుమార్ సహదేవ్ అనే పంపిణీదారుడు... తన కుమారుడు ఆకాష్‌ ను టాలీవుడ్‌ కు హీరోగా పరిచయం చేయాలని డిసైడయ్యాడు. ఈ సినిమా కోసం రెజీనా ను హీరోయిన్‌ గా తీసుకోనున్నారని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే సినిమా గురించి ఒక సూపర్‌ న్యూస్‌ తెలుస్తోంది.

కొత్త హీరో సరసన నటించాల్సి రావడంతో... ఈ సినిమా కోసం రెజీనా ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందట. ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్‌ లో ఓ 40 లక్షలు చేతిలో పెట్టి సినిమాలు ఆఫర్లు చేయని పరిస్థితి. కేవలం మంచుమనోజ్‌ తో చేస్తున్న శౌర్య సినిమా తప్పిస్తే.. అమ్మడికే పెద్దగా ఛాన్సులేం లేవు. పైగా లౌక్యం మూవీ ఫ్లాపుతో అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదంతే. అందుకే ఇలా వచ్చిన అవకాశంతో అమ్మడు మ్యాగ్జిమం వసూలు చేయాలని చూస్తోంది. కోటిన్నర డిమాండ్‌ చేసి చివరకు కోటి కి ఒప్పుకుందట.

ఎలాగైతే సమంత కోటిన్నరకు పైగా వసూలు చేసి.. కొత్త కుర్రాడు అల్లుడు శ్రీను కోసం గ్లామర్‌ ను భారీ రేంజులో ఆరబోసిందో.. ఇప్పుడు రెజీనా కూడా సేమ్‌ టు సేమ్‌ అలాగే రెచ్చిపోనుందని తెలుస్తోంది. కాని కోటి లాగేయడం అంటే పెద్ద విషయమే సుమీ.
Tags:    

Similar News