'కృష్ణ వ్రింద విహారి' లీల‌ల‌కు డేట్ ఫిక్స్‌

Update: 2022-03-07 06:01 GMT
యంగ్ హీరో నాగ‌శౌర్య విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ అవేవీ ఆశించిన ఫ‌లితాల్ని అందించ‌డం లేదు. అయినా స‌రే ఈ యంగ్ హీరో మాత్రం కొత్త త‌ర‌హా చిత్రాల‌తో వ‌రుస ప్ర‌యోగాలు చేస్తూనే వున్నారు. నాగ‌శౌర్య న‌టిస్తున్న తాజా చిత్రం `కృష్ణ వ్రింద విహారి`. అనిష్ ఆర్‌. కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉష ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీతో డామ‌న్ బ్యూటీ షిర్లే సేటియా హీరోయిన్ గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. నుదుటిపై తిల‌కం.. చేతిలో చెంబు ప‌ట్టుకుని అందులోంచి వాట‌ర్ తీసి చిరున‌వ్వులు చిందిస్తూ చ‌ల్లుతున్న స్టిల్ సినిమాలో హీరో నాగ‌శౌర్య పాత్ర కొత్త‌గా వుండ‌బోతోంద‌ని స్ప‌ష్టం చేసింది. తాజాగా చిత్ర బృందం సోమ‌వారం రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టిస్తూ కొత్త పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది. విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ మూవీని స‌మ్మ‌ర్ కే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తూ చిత్ర బృందం ఈ మూవీ రిలీజ్ డేట్ ని సోమ‌వారం ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుద‌ల చేస్తున్నామ‌ని వెల్ల‌డించింది. ఆ స‌మ‌యంలో మ‌రో మూవీ రిలీజ్ లేక‌పోవ‌డంతో నాగ‌శౌర్య ఈ డేట్ ని ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. బ‌జాజ్ చేత‌క్ స్కూట‌ర్ పై సంప్ర‌దాయ బ‌ద్ధ‌మైన క‌ట్టుకొట్టుతో డార్క్ బ్లూ క‌ల‌ర్ పంచె ధ‌రించి పైన వైట్ షార్ట్ దానికి బ్లాక్ క‌ల‌ర్ స్కార్ఫ్ వేసుకుని బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా నాగ‌శౌర్య డిఫ‌రెంట్ లుక్ తో క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

త‌న వెన‌కాలే సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా మ‌డి త‌ర‌హాలో చీర క‌ట్టులో అలంక‌రించుని స్కూట‌ర్ పై  హీరోయిన్ షిర్లే సేటియా క‌నిపిస్తున్న తీరు కూడా కొత్త‌గా వుంది. సినిమాలో వీరిద్ద‌రి పాత్రల్ని స‌రికొత్త‌గా డిజైన్ చేయ‌డ‌మే కాకుండా క‌థ‌, క‌థ‌నాలు కూడా కొత్త‌గా వుండేలా ద‌ర్శ‌కుడు ప్లాన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ పోస్ట‌ర్ లో ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా చ‌క్క‌గా కుద‌ర‌డం విశేషం.

గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా నాగ‌శౌర్య పాత్ర‌ని మ‌లిచిన తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లో చేరాల‌ని నాగ‌శౌర్య ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ నుంచి ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీ ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ ని అందించేలానే వుంద‌ని ఫిల్మ్ ల‌వ‌ర్స్‌ అంటున్నారు.

నాగ‌శౌర్య హోమ్ బ్యాన‌ర్ పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్న ఈ చిత్రంలో రాధిక‌, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, స‌త్య‌, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
Tags:    

Similar News