బడ్జెట్ ఎక్కువైనా తక్కువైనా ఏదో అష్టకష్టాలు పడి సినిమా నిర్మాణం పూర్తి చేయడం పెద్ద సవాల్ కాదు కానీ సరైన విడుదల తేదీని సెట్ చేసుకోవడం కత్తి సాము కన్నా రిస్కీగా మారుతోంది. నిఖిల్ కొత్త సినిమా ముద్ర అలాంటి సమస్యే ఎదుర్కుంటోంది. తమిళ్ బ్లాక్ బస్టర్ కనితన్ రీమేక్ గా రూపొందిన ముద్ర షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్ని ఫార్మాలిటీస్ అయిపోయినా విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. నిజానికి ముద్ర ప్లాన్ చేసింది నవంబర్ లో. అయితే పోటీ కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది.
రెండు వారాల క్రితం డిసెంబర్ 28 అంటూ పోస్టర్లు కూడా వదిలారు. అయితే సంక్రాంతి సందడి కి కేవలం పది రోజుల కన్నా తక్కువ టైం ఉండటంతో పాటు వారం వెనక వచ్చినవన్నీ క్రేజీ సినిమాలు కావడంతో మధ్య లో రిస్క్ అవుతుందనే ఉద్దేశంతో అన్ని అలోచించి డ్రాప్ అయ్యారు. దాని తర్వాత ఆ డేట్ మీద సత్య దేవ్ బ్లఫ్ మాస్టర్ కర్చీఫ్ వేసాడు. ఇప్పుడు జనవరి లో అనుకున్నా మూడో వారం నుంచి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సంక్రాంతి 9 నుంచి 14 దాకా వరస బెట్టి భారీ ప్రాజెక్ట్స్ విడుదల అవుతున్నాయి కాబట్టి వాటి సందడి తగ్గాలంటే కనీసం రెండు వారాలు దాటాలి. రజనీకాంత్ పెట్టా గురించి ఇంకా అయోమయం తొలగలేదు.
జనవరి 25కి తెలుగు వెర్షన్ విడుదల చేసే ఆలోచనలో ఉంది సన్ సంస్థ. అయితే అదే రోజు అఖిల్ మిస్టర్ మజ్ను ఫిక్స్ కాగా కళ్యాణ్ రామ్ 118కు ఆ తేదీనే పరిశీలనలో ఉంది. పోనీ ఫిబ్రవరిలో చూద్దాం అంటే రెండో వారం ఎంటర్ కావడానికి ముందే ఎన్టీఆర్ మహానాయకుడి తో పాటు వైఎస్ఆర్ యాత్ర రాబోతున్నాయి. సో ముద్ర డేట్ ని ఫిక్స్ చేసే ముందు ఇవన్నీ విశ్లేషించుకోవాలి. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ముద్ర కు ఒరిజినల్ వెర్షన్ తీసిన టిఎన్ సంతోషే దర్శకత్వం వహిస్తున్నాడు