స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా కాక తనకంటూ స్వంత ఐడెంటిటీ కోసం కష్టపడుతున్న అల్లు శిరీష్ కొత్త సినిమా ఏబిసిడి. అమెరికన్ బార్న్ కన్ ప్యూజ్ద్ దేశీ ఉపశీర్షిక. విడుదలకు సిద్ధంగా ఉంది. అంతా సవ్యంగా అనుకున్నట్టు జరిగితే ఈ నెలలోనే పలకరించే వాళ్ళు. ఊహించని విధంగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితి మారిపోయింది.
రాజకీయ పార్టీల ప్రచార హడావిడి న్యూస్ చానళ్ళ విశ్లేషణ గోల వెరసి జనం థియేటర్ల వైపు వెళ్లేందుకు అంతగా మొగ్గు చూపడం లేదు. ఈ ప్రధాన కారణంగానే వేరే సినిమాలు కూడా సేఫ్ గా మేకు షిఫ్ట్ అయిపోయి రిస్క్ లేకుండా చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఎబిసిడి కూడా అదే పనిలో ఉంది. కాకపోతే సరైన స్లాట్ ని దగ్గరలో సెట్ చేసుకోవడం ఛాలెంజ్ గా మారింది
ఏప్రిల్ లో ఉన్న నాలుగు వారాలు వరసగా మజిలి-చిత్రలహరి-జెర్సీ-సీత తీసేసుకున్నాయి. ఇప్పుడు దేనికీ పోటీగా దిగినా భావ్యం అనిపించుకోదు. పైగా ఇవన్ని ముందే షెడ్యూల్ చేసినవి. మధ్యలో వస్తే ఎవరికో ఒకరికి ఇబ్బంది తప్పదు. సో మేకు వెళ్ళాల్సిందే. ఇది ముందే గుర్తించిన నిఖిల్ అర్జున్ సురవరం మే 1కి కర్చీఫ్ వేసుకుంది. అటుపై 9న మహేష్ బాబు మహర్షి భారీ ఎత్తున వస్తున్నాడు. దానికి కొంత దూరంగా ఉండటం శిరీష్ లాంటి హీరోలకు ఓపెనింగ్స్ పరంగా సేఫ్ అవుతుంది.
సో ఎబిసిడికి మే మూడో వారం గురించి ఆలోచించడం తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన మూవీ రీమేక్ కాబట్టి దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. షూటింగ్ దశలోనే శాటిలైట్ భారీ ధర దక్కించుకుంది. రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న సందిగ్దత తొలగేందుకు ఇంకొంత టైం అయితే పట్టేలా ఉంది