రేష్మీ అందాలు, శ్రద్ధా దాస్ బోల్డ్ యాక్టింగ్ కలిసి.. క్రైమ్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన గుంటూరు టాకీస్ ని సూపర్ హిట్ గా నిలిపాయి. కమర్షియల్ గా అయితే సక్సెస్ సాధించింది కానీ.. మరీ బోల్డ్ గా ఉందంటూ విమర్శలను కూడా మూట కట్టుకుంది. వీటికి తోడు తాజాగా నమోదైన కేస్ కూడా.. గుంటూరు టాకీస్ యూనిట్ ని చిక్కుల్లో పడేసింది.
వికలాంగులను హేళన చేస్తూ శృతి మించిన స్థాయిలో జోక్స్ పెట్టారని, ముఖ్యంగా ఓ సన్నివేశంలో అయితే వారిని అవమానించేలా పిక్చరైజ్ చేశారని.. తెలంగాణ అంగవికలుర అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదుచేసి కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఓ వర్గాన్ని ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడానికే ఈ సీన్ పెట్టారని ఫిర్యాదులో చెప్పింది ఈ సంస్థ. వివాదం ముదరడంతో.. గుంటూరు టాకీస్ యూనిట్ స్వచ్ఛందంగా తామే ఓ మెట్టు కిందకు దిగొచ్చింది.
సినిమాలో కేరక్టర్ ను అనుసరించి ఆ సీన్ తీశాం తప్ప.. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పారు గుంటూరు టాకీస్ నిర్మాతలు. అందుకే ఈ సినిమాలో వివాదం సృష్టించిన సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు. మరి ఈ క్షమాపణతో కేసు నుంచి బయటపడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.