రేణు దేశాయ్ హీరోయిన్ గా చేసి చాలా ఏళ్లు అయినా కూడా ఆమెను ఇంకా నటిస్తే చూడాలని చాలా మంది కోరుతున్నారు. ఆమె నటిస్తే లక్షలకు లక్షల పారితోషికం వస్తుంది. అయినా కూడా ఆమె నటనపై ఆసక్తి ప్రస్తుతానికి చూపడం లేదు. సినిమాల మేకింగ్ పైన ఆమె ఆసక్తి చూపిస్తుంది. మరాఠిలో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ఆమె ముందు ముందు మరిన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను ప్రేక్షకులముందుకు తీసుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈమె ఆధ్య అనే వెబ్ సిరీస్ ను మొదలు పెట్టింది.
రైతులకు సంబంధించిన సినిమా లేదా వెబ్ సిరీస్ ను చేయాలని రేణు దేశాయ్ చర్చలు జరిపింది. ఈ రెండు మాత్రమే కాకుండా ఆడవారు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఆమె సినిమా తీయాలనుకుంటుంది. వారిని చైతన్య పర్చేందుకు తన సినిమాలు ఉపయోగపడేలా తీస్తానంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఆడవారు తల్చుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించేందుకు రేణు దేశాయ్ తన వెబ్ సిరీస్ మరియు సినిమాను సాదనంగా వాడబోతుంది.
మొత్తానికి తనకున్న క్రేజ్ ను కమర్షియల్ గా వినియోగించుకోకుండా రేణు దేశాయ్ సందేశాత్మక సినిమాలను వెబ్ సిరీస్ లను తీయాలనుకోవడం నిజంగా అభినందనీయం అంటూ కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.