చిత్రం :‘రెండు రెళ్ళు ఆరు’
నటీనటులు: అనిల్ మల్లెల - మహిమ - నరేష్ - రవి కాలె - ప్రమోదిని - ఐశ్వర్య - తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఛాయాగ్రహణం: అమర్ నాథ్ రెడ్డి
సమర్పణ: వారాహి చలనచిత్రం
నిర్మాతలు: ప్రదీప్ చంద్ర - మోహన్
రచన - దర్శకత్వం: నందు మల్లెల
అప్పుడప్పుడూ కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తుంటాయి. ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తుంటాయి. గత ఏడాది ‘పెళ్లిచూపులు’ ఆ కోవలోనే మంచి విజయం సాధించింది. మరిన్ని చిన్న సినిమాలకు ఊపు ఇచ్చింది. అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి తన బేనర్ ద్వారా ‘రెండు రెళ్ళు ఆరు’ అనే సినిమాను అందిస్తుండటంతో దీని మీదా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. దీనికి తోడు రాజమౌళి ఆడియో వేడుకకు వచ్చి ఈ సినిమా గురించి బాగా మాట్లాడి అంచనాల్ని పెంచాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రెండు రెళ్ళు ఆరు’లో అంత ప్రత్యేకత ఏముందో చూద్దాంపదండి.
కథ:
రాజు (నరేష్) - రావు (రవి కాలె) అనే ఇద్దరు వ్యక్తులు తమ భార్యలు ప్రసవించిన సమయంలో ఆసుపత్రిలో కలుస్తారు. అనివార్య పరిస్థితుల వల్ల తనకు పుట్టిన కొడుకును రవికి ఇచ్చేస్తే.. తన భార్య ప్రసవించిన ఆడ బిడ్డను రాజుకు ఇస్తాడు. ఇద్దరూ ఒకే కాలనీలో ఎదురెదురు ఇళ్లు తీసుకుంటారు. పరస్పరం స్నేహంగా మెలుగుతారు. ఐతే వారి పిల్లలైన మ్యాడీ (అనిల్ మల్లెల).. మ్యాగీ (మహిమ) చిన్నప్పట్నుంచి శత్రువుల్లాగా పెరుగుతారు. పెద్దయ్యాక వైరం మరింత పెరుగుతుంది. కానీ ఒకానొక సందర్భంలో ఇద్దరూ దగ్గరవుతారు. ప్రేమలో పడతారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ అది రాజు.. రావులకు ఇష్టం ఉండదు. అందుకు కారణమేంటి.. ఇంతకీ వాళ్లిద్దరూ బిడ్డల్ని ఎందుకు మార్చుకున్నారు.. చివరికి మ్యాడీ-మ్యాగీ కలిశారా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
ఇద్దరు తండ్రులు తమ పిల్లల్ని మార్చుకుని.. ఎదురెదురు ఇళ్లల్లో ఉంటూ పిల్లల్ని పెంచడం ఆలోచన చాలా కొత్తగా అనిపించేదే. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఎలా ఉంటుందన్న ఊహే చాలా చిత్రంగా ఉంటుంది. దీని గురించి ఆలోచిస్తూ పోతే రకరకాల భావనలు కలుగుతాయి. ‘రెండు రెళ్ళు ఆరు’ సినిమా ఆరంభ సన్నివేశం చూశాక మనకు ఇలాంటి ఫీలింగ్స్ ఎన్నో కలుగుతాయి. ఒక సరికొత్త సినిమా చూడబోతున్నామని ఎగ్జైట్ అవుతాం. కానీ ఐడియా కొత్తగా ఉంటే సరిపోదు.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఇంకా ముఖ్యమని కాసేపటికే అర్థమవుతుంది.
మూల కథ విషయంలో కొత్తగా ఆలోచించిన కొత్త దర్శకుడు నందు మల్లెల.. దాని చుట్టూ కథనాన్ని మాత్రం చాలా రొటీన్ గా అల్లాడు. కథను కొత్తగా మొదలుపెట్టి.. కాసేపటికే రొటీన్ బాటలోకి వచ్చేశాడు. ఒక సాదాసీదా సినిమా చూపించాడు. అక్కడక్కడా కొన్ని మెరుపులున్నా సరే.. ఓవరాల్ గా ‘రెండు రెళ్ళు ఆరు’ నిరాశ పరిచే సినిమానే. తాను ఎగ్జైట్ అయిన బేసిక్ ఐడియా చుట్టూ ఆసక్తికర కథనాన్ని అల్లుకోలేకపోయాడు నందు. తమ పిల్లలు కాని వాళ్లను తాము పెంచుతూ.. అవతలింట్లో ఉన్నవాళ్లు తమ పిల్లలని తెలిసినపుడు ఇద్దరు తండ్రులు భావోద్వేగాలు ఎలా ఉంటాయో.. వాళ్ల సంఘర్షణ ఎలాంటిదో కొంత మేర టచ్ చేసే ప్రయత్నం చేశాడు కానీ.. దీని చుట్టూ ఆసక్తికర సన్నివేశాలు అల్లుకోవడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు.
ఓ అమ్మాయి అబ్బాయి.. ఎదురెదురు ఇళ్లల్లో ఉండటం.. ఇద్దరూ శత్రువుల్లా పెరగడం.. ఒకరంటే ఒకరికి పడకపోవడం.. కానీ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడటం అన్న కాన్సెప్ట్ వినగానే మనకు ‘నువ్వే కావాలి’.. ‘ఆనందం’ సినిమాలు గుర్తుకొస్తాయి. దాదాపుగా అదే స్టయిల్లో హీరో హీరోయిన్ల ట్రాక్ ను నడిపించారిందులో. ఐతే తరుణ్-రిచా.. ఆకాశ్-రేఖ మాదిరిగా అనిల్-మహిమ ఆకట్టుకోలేకపోయారు. ఇద్దరూ చూడటానికి యావరేజ్ గా ఉండగా.. వాళ్ల నటన అపరిపక్వంగా అనిపించడంతో ఈ జోడీతో కనెక్టవడం కష్టమే. దీంతో చాలా సన్నివేశాలు తేలిపోయాయి. అక్కడక్కడా కొన్ని సీన్లు నవ్విస్తూ టైంపాస్ చేయించినా.. ప్రత్యేకంగా అనిపించే అంశాలైతే ఏమీ కనిపించవు.
ద్వితీయార్ధంలో హీరో హీరోయిన్ల దగ్గరయ్యే చోట కథనం కొంచెం ట్రాక్ లోకి వచ్చేట్లు అనిపించినా.. ప్రి క్లైమాక్స్ దగ్గర మళ్లీ పట్టు తప్పుతుంది. ఈ కథను ఎలా ముగించాలో తెలియని గందరగోళంలో దర్శకుడు పడిపోయాడనిపిస్తుంది ముగింపు సన్నివేశాలు చూస్తే. హీరో హీరోయిన్ల ట్రాక్ కు ‘నువ్వే కావాలి’.. ‘ఆనందం’ సినిమాలు స్ఫూర్తిగా నిలిస్తే.. క్లైమాక్స్ కోసం ‘గీతాంజలి’ని వాడేసుకున్నాడు. కానీ అందులో మాదిరి దీన్ని ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో ఫెయిలయ్యాడు. హీరో హీరోయిన్ల ఆరోగ్య పరిస్థితి చూసి ప్రేక్షకులు కదిలిపోయినపుడే ఇలాంటి సినిమాలు వర్కవుటవుతాయి. కానీ ఆ విషయాన్ని బలంగా చెప్పే ప్రయత్నం కానీ.. వాళ్ల పరిస్థితిని ఎస్టాబ్లిష్ సీన్స్ కానీ పడలేదు. సింపుల్ గా ‘‘వీళ్లెంత కాలం బతుకుతారో తెలియదు.. కానీ బతికినంత కాలం సంతోషంగా బతుకుతారు’’ అంటూ అచ్చంగా ‘గీతాంజలి’ డైలాగ్ తో సినిమాను ముగించేశాడు దర్శకుడు. ఇక్కడ ఏమాత్రం ఫీల్ ఉండదు. ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. మొత్తంగా ‘రెండు రెళ్ళు ఆరు’ కాన్సెప్ట్ వరకు మాత్రమే ప్రత్యేకంగా అనిపిస్తుంది తప్ప.. అంతకుమించి చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవిందులో.
నటీనటులు:
హీరో అనిల్ మల్లెల లుక్స్ పరంగా యావరేజ్ గా అనిపిస్తాడు. నటన కూడా ఏమంత ప్రత్యేకంగా లేదు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదనిపించాడు కానీ కీలకమైన సన్నవేశాల్లో తేలిపోయాడు. హీరోయిన్ మహిమ పర్వాలేదు. కొన్ని చోట్ల అందంగా అనిపిస్తుంది. ఆమె నటన కూడా అంతంతమాత్రమే. సీనియర్ నటుటు నరేష్.. రవి కాలె మాత్రం సినిమాను నిలబెట్టేందుకు తమ వంతుగా గట్టి ప్రయత్నమే చేశారు. వాళ్లు కనిపించినపుడే ప్రేక్షకులు ఆసక్తిగా సినిమా చూస్తారు. హీరో హీరోయిన్ల తల్లులుగా నటించిన వాళ్లు అంతగా ఆకట్టుకోరు. తాగుబోతు రమేష్ కథతో సంబంధం లేకుండా ఓ చిన్న ట్రాక్ ద్వారా నవ్వించే ప్రయత్నం చేశాడు. అదేమంత ఫలితాన్నివ్వలేదు.
సాంకేతికవర్గం:
విజయ్ బుల్గానిన్ సంగీతం పర్వాలేదు. ద్వితీయార్ధంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే మెలోడీ ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు.. నేపథ్య సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తాయి. అమర్ నాథ్ రెడ్డి ఛాయాగ్రహణంలో ఏ విశేషం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అంతంతమాత్రమే. నిర్మాతలుగా వేరే వాళ్ల పేర్లు పడ్డాయి కాబట్టి ప్రొడక్షన్ అయ్యాక సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని తన చేతికి తీసుకున్నట్లుంది. ఆయన మార్కు క్వాలిటీ సినిమాలో కనిపించలేదు. ఇక దర్శకుడు నందు మల్లెల ఒక మంచి అవకాశాన్ని వృథా చేసుకున్నాడనే చెప్పాలి. స్క్రిప్టు మీద అతను మరింత కసరత్తు చేయాల్సింది. డైలాగుల్లో మాత్రం అతను మెప్పించాడు. స్క్రీన్ ప్లే విషయంలో ఫెయిలయ్యాడు. అతను ప్రధాన పాత్రధారుల నుంచి సరైన నటన రాబట్టుకోలేకపోయాడు. ఈ పాత్రలకు కొంచెం అనుభవమున్న నటీనటుల్ని పెట్టుకుంటే బాగుండేదేమో.
చివరగా: రెండు రెళ్ళు ఆరు.. పైపై మెరుగులే!
రేటింగ్- 2/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre