టాలీవుడ్ కు బద్రితో పరిచయమై హీరోయిన్ గానే కాక పవన్ కళ్యాణ్ భార్యగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని ఆపై విడాకులతో ఆయనకు దూరమయ్యాక కూడా టాలీవుడ్ తో ఈ మధ్యకాలంలో బాగా టచ్ లోకి వస్తున్న రేణు దేశాయ్ త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 3లో కంటెస్టెంట్ గా చేస్తారని ఓ వార్త షికారు చేసింది. కొన్ని నెలల క్రితం ఓ డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరించడంతో పాటు పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో బిగ్ బాస్ లో నటించే అవకాశాలు కొట్టిపారేయలేక అందరూ నిజమనుకున్నారు.
కాని రేణు దేశాయ్ మాత్రం వాటిని కొట్టిపారేశారు. ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చిందని అయితే యాంకర్ గా దాన్ని ప్రెజెంట్ చేయడానికి ఇష్టపడతానే తప్ప అందులో సభ్యురాలిగా మాత్రం కాదని తేల్చి చెప్పేశారు. సో రేణు దేశాయ్ బిగ్ బాస్ 3లో ఉండేది పుకారని తేలిపోయింది . నాగార్జున హోస్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి కాని అది నిజమా కదా అనే నిర్ధారణ ఇంకా జరగలేదు. ఒకపక్క కమల్ హాసన్ యాంకర్ గా తమిళ్ లో స్టార్ట్ కాబోతుంటే తెలుగులో మాత్రం అలాంటి సూచనలేమీ కనిపించలేదు.
దీంతో అసలీ షో ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఇంకో రెండు వారాల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చు. ఆలు లేదు చూలు లేదు తరహలో అప్పుడే కొన్ని న్యూస్ ఛానల్స్ బిగ్ బాస్ 3లో ఎవరు ఉంటారు అనే దాని మీద డిబేట్లు పెట్టడంతో రేణు దేశాయ్ టాపిక్ చర్చలోకి వచ్చింది. ఇప్పుడు స్పష్టగా చెప్పేయడంతో మిగిలిన పార్టిసిపెంట్స్ ఎవరా అనే సస్పెన్స్ కొనసాగనుంది