దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రముఖుల నుండి సామాన్యుల వరకు ఎవరికి తోచిన విధంగా వారు అవగాహన నిమిత్తం సలహాలు ఇస్తున్నారు. నిన్న ఏపీ మరియు తెలంగాణలో ఎన్నికలు పూర్తి అయిన విషయం తెల్సిందే. ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది కూడా తాము ఓటు హక్కును వినియోగించుకుని పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేశాం. మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకుని బాధ్యత కలిగిన పౌరులుగా నిలవండి అంటూ చాలా మంది రేణు దేశాయ్ కి మెసేజ్ లు పెట్టారట. దాంతో ఆమెకు చిరాకు ఎత్తింది.
తన బాధ్యతను గుర్తు చేస్తూ మెసేజ్ లు పెట్టిన వారిపై ఆగ్రహంతో కామెంట్స్ చేసింది. ఇది జనహితం కోసం నేను జారీ చేస్తున్నాను - నా ఓటు పూణెలో ఉంది - ఏప్రిల్ 23వ తారీకున ఓటింగ్ జరుగబోతుంది. నాకు దయచేసి ఓటు యొక్క ప్రాముఖ్యతను చెబుతూ లెక్చర్స్ ఇస్తూ సందేశాలు పంపడం మానేయండి. ఎందుకంటే ఇతరుల సందేశాలు - లెక్చర్స్ వినే స్థితిలో నేను లేను అంటూ చెప్పుకొచ్చింది. ఒకరితో వేలు ఎత్తి చూపించుకునేలా నేను ఎప్పుడు వ్యవహరించను, నేను ఖచ్చితంగా నా భాద్యతను నిర్వర్థిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి రేణు దేశాయ్ ని అన్ని విధాలుగా, అన్ని సార్లు కూడా పవన్ ఫ్యాన్స్ ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో కదిలిస్తూనే ఉన్నారు.