రేణు దేశాయ్ రెండవ పెళ్లికి నిశ్చితార్థం జరిగి చాలా నెలలు అవుతోంది. అయినా ఇప్పటికి పెళ్లి కాకపోవడంపై పలువురు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. కొందరు రేణు దొంగతనంగా పెళ్లి చేసుకుంది, నిశ్చితార్థం సమయంలోనే ఆమెకు వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ చేశారు. అందుకే పెళ్లి అయితే ఆ వ్యతిరేకత మరింత వచ్చి బౌతిక దాడులకు కూడా పాల్పడే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో రేణు దేశాయ్ రహస్యంగా పెళ్లి చేసుకుని ఉంటుందని కొందరు ఊహాగాణాల్లో ఉన్నారు. మరి కొందరు మాత్రం పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా అంటూ రేణు దేశాయ్ ను నేరుగా ప్రశ్నిస్తున్నారట.
తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో జనాల హడావుడిపై స్పందించిన రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. తాను దొంగ పెళ్లి చేసుకోలేదు, నా పెళ్లికి హడావుడి ఏమీ లేదు. అంతా సాఫీగా సజావుగా, నెమ్మదిగా సాగుతుందని, త్వరలోనే నా పెళ్లి అధికారికంగా అందరికి చెప్పి మరీ చేసుకుంటాను. పూర్తి వివరాలు చెప్పకున్నా, నా పెళ్లికి సంబంధించిన విషయాలను మాత్రం అందరితో షేర్ చేసుకుంటాను అంది. నేనేం దొంగ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదంది.
తనకు కాబోయే భర్త అమెరికా నుండి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం పూణెలోని ఒక ఐటీ కంపెనీలో డైరెక్టర్ గా చేస్తున్నారని చెప్పుకొచ్చింది. తన పెళ్లి గురించి ఇతరుల హడావుడి ఎక్కువ అయ్యిందని, నా పెళ్లికి చాలా ప్రాసెస్ ఉంది, అంతా కూడా సాఫీగా సాగేలా ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని రేణు తన పెళ్లికి సంబంధించిన విషయాలపై క్లారిటీ ఇచ్చింది.