పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సోషల్ మీడియాలో చాలా రెగ్యులర్ గా పోస్టులు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ బర్త్ డే నేడు. ఈ సందర్బంగా ఆమెకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. ఎంతో మంది ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సమయంలో ఆమె జీవితాన్ని బంతితో పోల్చుతూ బంతి ఫిలాసఫీని చెప్పింది. ప్రతి ఒక్కరి జీవితంలో మీదకు బంతులు వస్తుంటాయి. అవి ఎలాంటి బంతులు అయినా కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి.
ప్రతి బంతిని సమర్థ వంతంగా ఎదుర్కొన్న వారు మాత్రమే జీవితంలో విజేతగా నిలుస్తారు. ప్రతి సమస్యను కూడా ధైర్యంగా సమర్థవంతంగా ఎదుర్కొని దాన్ని తిప్పి కొట్టినట్లయితే ఎలా అయితే స్టేడియం నుండి విజేతగా బయటకు వస్తారో అలాగే నువ్వు కూడా విజేతగా జీవితంలో నిలబడుతావు అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఎక్కడకు వెళ్లిన ఛాంపియన్ గా నిలవాలని ప్రయత్నించాలని రేణు దేశాయ్ సూచించింది. హైదరాబాద్ కు మకాం మార్చిన తర్వాత రేణు దేశాయ్ ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తుంది. మరో వైపు ఈమె నటిగా కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది.