హైదరాబాద్ కు రేణూ దేశాయ్ ఫిష్ట్

Update: 2019-08-05 14:30 GMT
నటిగా సుపరిచితురాలు.. పవన్ కల్యాణ్ మాజీ భార్యగా ప్రముఖురాలు.. అభిరుచి ఉన్న సినిమాల్ని నిర్మిస్తారన్న పేరున్న రేణూదేశాయ్ తాజాగా ఆసక్తికర నిర్ణయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. గడిచిన కొంతకాలంగా కామ్ గా ఉంటున్నారు. తన రెండో పెళ్లి విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. కొంతమంది జర్నలిస్టులకు తరచూ ఇంటర్వ్యూలు ఇచ్చే రేణు.. తాజాగా మహిళా జర్నలిస్టు హేమకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

స్నేహితుల దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన రేణు.. ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తాను త్వరలో హైదరాబాద్ కు షిఫ్ట్ కానున్నట్లు చెప్పారు. పవన్ తో బ్రేకప్ తర్వాత ఏళ్లకు ఏళ్లుగా పూణెలో ఉంటున్న రేణు.. తాను హైదరాబాద్ కు షిఫ్ట్ కావటానికి కారణాల్ని వివరించారు. త్వరలో తాను రైతుల సమస్యల నేపథ్యంలో సినిమా చేయాలని భావిస్తున్నానని.. అందులో భాగంగా తాను హైదరాబాద్ లో ఉండనున్నట్లుగా చెప్పారు.

ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. దీనికి సంబంధించిన చర్చల కోసం.. ఇతర పనుల కోసం తరచూ ఫూణె నుంచి.. హైదరాబాద్ కు వస్తున్నాని.. తిరగటం ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉందని.. అందుకే తానుహైదరాబాద్ కు ఏడాది పాటు షిఫ్ట్ కావాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. అయితే.. ఎన్ని రోజుల్లో షిఫ్ట్ అవుతారు? అన్న విషయంపై మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు రేణు.

ఒకవేళ.. ఈ సినిమా తర్వాత అవకాశాలు వస్తే..మరికొంత కాలంపాటు హైదరాబాద్ లోనే ఉండనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆ మధ్యన పూణెకు చెందిన వ్యక్తిని పెళ్లాడనున్నట్లుగా చెప్పిన రేణు.. ఆయన వివరాల్ని వెల్లడించలేదు. గతంలో తరచూ రెండో పెళ్లి ముచ్చట్లను సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. తర్వాతి కాలంలో ఆ విషయాన్ని ప్రస్తావించటమే మానేశారు. మొత్తానికి రేణు హైదరాబాద్ షిఫ్టింగ్ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News