మెగా హీరో సాయి తేజ్ - 'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ''రిపబ్లిక్''. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతుండగా.. గత శుక్రవారం (అక్టోబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ కూడా బాగానే రాబట్టిన ఈ చిత్రం.. వారాంతంలో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయిందని తెలుస్తోంది.
'రిపబ్లిక్' సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 6.73 కోట్ల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాంలో 2.10 కోట్లు - సీడెడ్ 1.11 కోట్లు - వైజాగ్ 76 లక్షలు - ఈస్ట్ & వెస్ట్ 88 లక్షలు - కృష్ణ 41 లక్షలు - గుంటూరు 47 లక్షలు - నెల్లూరు 28 లక్షలు - రెస్టాఫ్ ఇండియాలో 72 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా మేకర్స్ సేఫ్ జోన్ లోకి చేరాలంటే రెండో వారంలో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.
కాగా, 'రిపబ్లిక్' చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా.. రమ్యకృష్ణ - జగపతిబాబు - సుబ్బరాజు - రాహుల్ రామకృష్ణ - పోసాని కృష్ణమురళి - శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ రైట్స్ ను జీ గ్రూప్ వారు దక్కించుకున్నారు.