కౌశ‌ల్ విన్న‌ర‌ని చెప్పిన యాంక‌ర‌మ్మ‌!

Update: 2018-08-23 08:05 GMT
బిగ్ బాస్ సీజ‌న్ 2 చ‌ప్ప‌గా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. హౌస్ మేట్స్ తో పాటు.. లోప‌ల బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు చాలావ‌ర‌కూ పెద్ద‌గా పాపుల‌ర్ కాలేద‌న్న మాట వినిపిస్తోంది. ఈ సీజ‌న్లో ఏదైనా ముచ్చ‌ట ఉందంటే అది కౌశ‌ల్ వ్య‌వ‌హారంగానే చెప్పాలి.

ఇప్ప‌టికే హౌస్ లో జ‌రిగే అంశాల‌పై అదే ప‌నిగా లీకులు కావ‌టం.. తుది ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై పిచ్చ క్లారిటీ రావ‌టంతో.. ఈ షోను చూసే వాళ్ల కంటే.. సోష‌ల్ మీడియాలో ఈ షో వెంట న‌డిచే వివాదాల్ని ఫాలో అయ్యే వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది.

యాంక‌ర్ రేష్మి సంగ‌తే చూడండి.. బిగ్ బాస్ ను తాను చూడ‌నంటే చూడ‌న‌ని చెబుతోంది. కాకుంటే.. అందులో ఏం జ‌రిగినా.. సోష‌ల్ మీడియాలో పోస్టుల రూపంలో స‌మాచారం అందుతుంద‌ని చెప్పింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశ‌ల్ పేరు మీద ఆర్మీ త‌యారు కావ‌టం.. బుల్లితెర మీద కౌశ‌ల్ మీద వ్య‌క్తి ఆరాధ‌న పీక్స్ కు చేర‌టంపై ప్ర‌త్యేక చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా యూట్యూబ్ ఛాన‌ల్ తో మాట్లాడిన రేష్మి.. బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌ర‌న్న విష‌యాన్ని చెబుతూ.. ఇంకెవ‌రు కౌశ‌లేన‌ని తేల్చేశారు. ఒక‌వేళ‌.. కౌశ‌ల్ కాకుండా మ‌రెవ‌రినైనా బిగ్ బాస్ విన్న‌ర్ గా అనౌన్స్ చేస్తే.. గొడ‌వ‌లు అయిపోతాయ‌ని.. ధ‌ర్నాలు జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన‌టం విశేషం.  కౌశ‌ల్ ఆర్మీచాలా స్ట్రాంగ్ అని.. చాలా ఫీడ్స్.. పోస్ట్స్.. వీడియోస్ చేసి పెట్ట‌టం చూస్తే.. వ‌న్ సైడెడ్ గా ఉంద‌న్న మాట‌ను ర‌ష్మి వెల్ల‌డించింది. బిగ్ బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ అంటూ రేష్మి మాట్లాడిన మాట‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Tags:    

Similar News