రేష్మీ.. ఇప్పుడీ పేరు తెలియని తెలుగువాళ్లు ఉండరని చెప్పచ్చు. జబర్దస్త్ ప్రోగ్రాంతో జబర్దస్త్ గా తెలుగోళ్లకు తెలిసిపోయింది. అంతకు ముందే సినిమాల్లోనూ కనిపించినా.. పెద్దగా పేరు రాలేదు రష్మీకి. ఇప్పుడు కూడా ఒకటి అరా సినిమాల్లో కనిపిస్తోంది. తనకి ఉన్న గుర్తింపుతో పోల్చితే.. అసలు ఆమె చేయాల్సిన అవసరం లేనటువంటి పాత్రల్లోనూ దర్శనమిస్తోంది.
ఈ విషయంలో తనను చాలామంది మోసం చేశారని చెబ్తోంది రేష్మీ ఎప్పుడూ అవకాశాల కోసం తాను వెంటపడలేదని, తనకొచ్చిన ఆఫర్ల నుంచి సెలక్టివ్ గానే చేశానంటోంది. తన పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకున్నా... తీరా మూవీ రిలీజ్ అయ్యేసరికి.. అసలు తాను కనిపించకుండా పోయిన సినిమాలు కూడా ఉన్నాయంటోంది.
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు తీస్తున్న గుంటూర్ టాకీస్ లో రష్మీకి మంచి పాత్రే దక్కిందట. ఈ మూవీ రిలిజ్ తర్వాత.. తన ఫేట్ మారిపోతుందని ఆశలు పెట్టుకుంది జబర్దస్త్ సుందరి. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ... ఇలా అన్ని భాషలూ చుట్టేస్తూ... చిన్నా చితకా పాత్రలు చేస్తోంది తప్ప... రేష్మీకి బ్రేక్ రాలేదు ఇప్పటివరకూ. రేష్మి గోడు విని.. ఆమెను మోసం చేయకుండా... ట్యాలెంట్ ని బయటకు తీసే డైరెక్టర్ ఎవరో?