#పుష్ప‌.. నార్త్ నైజాం క‌లెక్ష‌న్స్ బెస్ట్ అందుకేన‌న్న ఆర్జీవీ

Update: 2022-01-11 05:33 GMT
ఒక ఉత్ప‌త్తిని త‌యారు చేసి దానిని అమ్ముకునే రేటు ఫిక్స్ చేసే రైట్ ఎవ‌రికి ఉంటుంది? ఆ  ఉత్ప‌త్తి త‌యారు చేసిన వాడికి లేదా ప్ర‌భుత్వానికి? అంటూ లాజిక్ ని వెతికారు ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. తినుబండారాలు స‌హా ఎన్నో ఉత్ప‌త్తుల ధ‌ర‌ల్ని కంపెనీలు నిర్ణ‌యించుకుంటాయి. ప‌న్నులు వ‌సూలు చేసుకునే హ‌క్కు మాత్రం ప్ర‌భుత్వాలకు ఉంది. కానీ ఆ ఉత్ప‌త్తిపై ధ‌ర‌ను నిర్ణ‌యించే హ‌క్కు ప్ర‌భుత్వానికి లేదు. ఇక దాని ధ‌ర‌ను బ‌ట్టి కొనాలా వ‌ద్దా అనేది ప్ర‌జ‌లే నిర్ణ‌యించుకుంటారు. కానీ దానికి భిన్నంగా సినిమా టికెట్ ధ‌ర‌ల్ని ప్ర‌భుత్వం కంట్రోల్ చేయ‌డం అన్న‌ది స‌రికాద‌ని రామ్ గోపాల్ వ‌ర్మ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల్ని అదుపు చేయ‌డం వ‌ల్ల‌నే పుష్ప లాంటి హిట్ సినిమాకి ఏపీలో స‌రైన క‌లెక్ష‌న్స్ రాలేద‌ని అన్నారు. నార్త్ నైజాంతో పోలిస్తే ఏపీలో తీసిక‌ట్టుగా ఉండ‌డానికి కార‌ణం టికెట్ ధ‌ర‌ల త‌గ్గుద‌లేన‌ని అన్నారు. ఇంత‌కుముందు ప్ర‌భుత్వం ముందు త‌న వాద‌న వినిపించేందుకు వ‌చ్చాన‌ని ప్ర‌క‌టించిన రామ్ గోపాల్ వ‌ర్మ ఏపీ స‌చివాల‌యం లో మీటింగ్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వాలు సినిమా టికెట్ ధ‌ర‌ల్ని నియంత్రించ‌కూడ‌ద‌ని అన్నారు. అంతేకాదు.. మొద‌టి నుంచి దీనికి నేను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని దీనిని అడిగేందుకే మంత్రి పేర్ని నానీతో భేటీ అయ్యాన‌ని అన్నారు.

అయితే చ‌ట్ట ప్ర‌కార‌మే సినిమా టికెట్ ధ‌ర‌ల్ని నిర్ణ‌యించామ‌ని పేర్ని నాని ఆర్జీవీకి షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇబ్బంది అయితే సినిమాలు వాయిదా వేసుకోండ‌ని అన్నారు. త్వ‌ర‌లోనే క‌మిటీ నిర్ణ‌యాల‌ను బ‌ట్టి సినిమా టికెట్ రేట్ల‌ను నిర్ణ‌యిస్తామ‌ని కూడా పేర్ని అన్నారు. వ‌ర్మ లాగే సూచ‌న‌లు స‌ల‌హాలు ఇచ్చేవారిని ఆహ్వానిస్తున్నామ‌ని కూడా క్లారిటీనిచ్చారు.
Tags:    

Similar News