'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ ఆర్జీవీ చేసిన హంగామా తెలిసిందే. రియల్ లైఫ్ క్యారెక్టర్లతో బర్నింగ్ పాలిటిక్స్ పై సినిమా తెరకెక్కించిన ఆర్జీవీ కులరాజకీయాలు హత్యా రాజకీయాల్ని టచ్ చేయడంతో రాజకీయ వర్గాల్లో కాకలు పుట్టుకొస్తున్నాయ్. అంతా నా ఇష్టం అన్న చందంగా ఆర్జీవీ ఇప్పటికే జీవించి ఉన్న నాయకుల డూప్ లను వెతికి మరీ గేమ్ స్టార్ట్ చేయడంతో అది కాస్తా జనాల్లో వైరల్ గా ప్రచారమైంది. అయితే ఈ సినిమాని రిలీజ్ కానిస్తారా? అంటూ చాలా ముందు నుంచే సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతా అనుకున్నట్టే అయ్యింది. ఆర్జీవీని కోర్టులు-కేసులు అంటూ దిగ్భందనం చేశారు. సెన్సార్ గడపపైనా చుక్కెదురు కావడంతో ఇప్పుడు ఆర్జీవీ ఈ సినిమాని ఎలా రిలీజ్ చేస్తారో చూడాలన్న ఉత్కంఠ ఆయన అభిమానుల్లో నెలకొంది.
ఇప్పటికే ఈ చిత్రానికి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ టైటిల్ ని మార్చినా కానీ రిలీజ్ కి సెన్సార్ బృందం అడ్డంకులు చెప్పింది. లెక్కకు మిక్కిలిగా ఉన్న కించపరిచే సన్నివేశాల్ని తొలగించాల్సిందిగా.. బోలెడన్ని కట్స్ చెప్పడంతో అందుకు ఆర్జీవీ వ్యతిరేకించారు. రివైజింగ్ కమిటీకి వెళుతున్నట్టు ప్రకటించారు. సినిమాలో ఏ సన్నివేశాన్ని కట్ చేసినా ఇందులో ఉండే క్యూరియాసిటీ మిస్సవుతుందనేది ఆర్జీవీ వాదన. అయితే కోర్టు ఆదేశానుసారం రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అల్లర్లు చెలరేగకుండా సెన్సార్ బృందం కటింగ్ చేయాల్సి ఉంటుందట. అలాగే జీవించి ఉన్న నాయకులను తెరపై చూపిస్తున్నారు కాబట్టి వాళ్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను ఆర్జీవీ తేవాలన్న కండిషన్ పెట్టారట. అందువల్ల ఈ పంచాయితీ ఇప్పట్లో తేలేట్టు లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా సన్నివేశం చూస్తుంటే ఆర్జీవీ సినిమా బ్లాక్ అయినట్టేనన్న ముచ్చటా వేడెక్కిస్తోంది. ఆర్జీవీ గత చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ కి వివాదాల కారణంగా ఇదే సన్నివేశం ఎదురైంది. అప్పట్లో ఎన్నికల కోడ్ వల్ల ఏపీలో ఈ చిత్రాన్ని రిలీజ్ కానివ్వకుండా తేదేపా బృందం అడ్డుకోగలిగింది. ఇప్పుడు మరోసారి సెన్సార్ పరమైన చిక్కుల్ని.. కోర్టు వివాదాల్ని ఆర్జీవీ ఎదుర్కొంటున్నారు. ఈసారి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను నాయకులు ఇవ్వాలట. అంటే అది ఇప్పట్లో అయ్యే పని కాదు. అమ్మ రాజ్యంలో కడన బిడ్డలు రిలీజ్ ఇప్పటికి డైలమాలో పడినట్టే.