ఏ సినిమా తీసినా అందులో నటించే హీరో స్టామినా లేదా దర్శకుడి స్టామినాను బట్టి బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు హీరోయిన్ స్టామినాను అనుసారంగా కూడా భారీగా ఖర్చు పెట్టవచ్చు. కేవలం కథను నమ్మి స్టార్ కాస్ట్ కు పెద్దగా క్రేజ్ లేకున్నా కూడా భారీ బడ్జెట్ పెట్టడం అనేది జూదంతో సమానం అంటూ గతంలో పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది. స్టార్ కాస్ట్ లేకుండా భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాలు బడ్జెట్ రికవరీ చేసిన శాతం కేవలం 1% మాత్రమే. ఇప్పుడు ఒక యంగ్ హీరో ఏకంగా 30 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నానంటూ ప్రకటించాడు.
ఒక స్టార్ నటుడి తనయుడు అయిన ఆ యువ హీరో కెరీర్ ఆరంభించి చాలా ఏళ్లు అయ్యింది. మొదట్లో ఒకటి రెండు సక్సెస్ అయినా ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ లే చవి చూస్తూ వచ్చాడు. తండ్రి పేరు చెప్పుకుని కెరీర్ నెట్టుకు వస్తున్న ఆయన ఇప్పటి వరకు 10 కోట్లు వసూళ్లు చేసింది లేదు. అయినా కూడా ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అంటూ 30 కోట్లబడ్జెట్ తో సినిమా చేయడం విచిత్రంగా ఉంది. ఆయనపై 30 కోట్లు పెట్టడం అంటే ఖచ్చితంగా అది వృదా అనిపిస్తుంది. రూ.30 కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం చేస్తున్నారు కాని అది పబ్లిసిటీ స్టంట్ అయ్యి ఉంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో ఆయన్ను కొందరు మొదట ఇంట గెలిచి ఆ తర్వాత పాన్ ఇండియా లో గెలవరాదు అంటూ విమర్శలు చేస్తున్నారు.